మంచి మాట

పూరీ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్తితో పిలిస్తే పలికే పరమాత్మ జగన్నాథునిగాను పూరీ క్షేత్రంలో దారుమూర్తిగాను నిలిచాడు. నిరాకారుడైన సర్వమంగళుడు కన్నుముక్కు చెవులను రంగులతో దిద్దించుకుని కాళ్లుచేతుల ఆకారాలు లేకుండానే విచిత్రమైన రీతిలో భక్తులకు కనువిందుచేస్తూన్న జగన్నాటక సూత్రధారి అయన మహావిష్ణువు జగన్నాథునిగా కీర్తించబడుతున్నాడు. శివకేశవులు అభిన్నులు. మహావిష్ణువు అలంకార ప్రియుడు. మహాశివుడు అభిషేకప్రియుడు. కనుకనే మహాశివునికి ఆస్థానమైన కాశీలో శివాభిషేకాలు ప్రత్యేకం. అలంకారప్రియుడైన మహావిష్ణువు వివిధనామారూపాలతో కొలువైన క్షేత్రాల్లోని ఏ క్షేత్రమైనా పలు ప్రత్యేకతలకు ఆలవాలంగా ఉంటుంది. శివాలయాల్లో పార్వతీ దేవి భక్తుల కడగండ్లను వారి క్షుద్బాధను తీరిస్తే మహాలక్ష్మీ దేవి విష్ణువా లయాల్లో భక్తుల కోరికలను, వారి ఆకలి బాధలను తీరుస్తూ ఉంటుంది. ఎక్కడైనా అమ్మ అయ్య ఒక్కరే. రూపమే లేని భగవంతుడు అనేక రూపాల్లో దర్శనమివ్వడం, నామమే లేని వాడు అనంత నామధారునిగా ప్రకటితమవ్వడం అంటే అవ్యక్తుడైన పరమాత్మ వ్యక్త్తమవ్వడమే. అట్లాంటి విభిన్న ప్రత్యేకతలున్న క్షేత్రం పూరీ మహాక్షేత్రం. ఇక్కడ జగన్నాథునికి జరిగే అన్నీ ప్రత్యేకతలూ విశిష్టరీతిలో ఉంటూ జనాలను ఆకర్షిస్తూ ఉంటాయ.
పూరీక్షేత్రంలో సువిశాలమైన నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలమున్న ఆలయం ఇది. ఈ ఆలయ గోపురం సుమారుగా 214 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనిపైన సుదర్శనచక్రం దేదీప్యమానంగా వెలుగులీనుతూ మహావిష్ణువు భక్తుల సంరక్షణార్థం వేంచేసి ఉన్నాడన్న సంకేతాన్ని ఇస్తున్నట్టుగా దర్శనమిస్తుంది. సగం సగం పూర్త్తయన రూపాలతో ఉన్న ఇక్కడి జగన్నాథుని ఉత్సవాలు, ఆచారాలు, సంబ రాలలాంటివన్నీ కూడా విచిత్ర వినూత్నమైన ఆశ్చర్యానందంగా సాగుతాయ. పూరీ క్షేత్రంలో సోదర, సోదరీ సమేతుడైన జగన్నాథుడు జనాలకు దర్శనమిస్తాడు.పూరీ జగన్నాథుని రథోత్సవం ప్రతిఏటా ఆషాడమాస శుద్ధ విదియనాడుప్రారంభమవుతుంది
ఎన్నో ప్రత్యేకతలున్న ఈ జగన్నాథుని రథయాత్ర వైశిష్ట్యాన్ని గురించి స్కాందపురాణం వివరిస్తుంది. 45 అడుగుల ఎత్తు, 16 చక్రాలు 35 అడుగుల చతురస్రాకారంకలిగిన రథాన్ని పసుపు, ఎరుపు వస్త్రాలతో అలంకరించి నందిఘోష అన్న పేరుపెట్టిన రథం పైన జగన్నాథుడు, 14 చక్రాలు, నీలం, ఎరుపు వస్త్రాలతో అలంకారం చేసి తాళధ్వజ అన్న పేరు పెట్టిన రథంపైన బలభద్రుడు 12 చక్రాలతో నిర్మితమై ఎరుపు నలుపు రంగువస్త్రాలతో అలంకరించి దర్పదళన అన్న నామంతో ఉన్న రథం పై సుభద్ర రథయాత్రకు బయలుదేరుతారు.
ఈ రథయాత్ర లో మున్ముందుగా బలభద్రుని రథం, దాని వెంట సుభద్ర రథం కదులుతాయి. చివరగా జగన్నాటక కర్తయైన జగన్నాథ రథ చక్రాలు కదులుతాయి. గుండిచాగుడికి నందిఘోష ప్రారంభమవుతుంది. మంగళఘోషతో నాట్యవిన్యాసాలతో ప్రారంభమైన ఈ రథయాత్ర పూరీకి దాదాపు 1.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనకపురం లోని గుండీచా ఘర్‌కుచేరుతారు. ఇక్కడఉన్న మహాలక్ష్మీదేవి తన్ను తీసుకువెళ్లకుండా అన్నచెల్లెళ్లతో తిరుగుతున్న జగన్నాథుని పై కోపాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె కోపంతో జగన్నాథుని రథాన్ని విరగ్గొడుతుంది. ఆమె కోపం పోగొట్టడానికి జగన్నాథుడు తొమ్మిదిరోజులు ఈ మందిరం లో ఉంటాడు. ఇక్కడే ప్రత్యేక పూజలు చేయంచుకుంటాడు. అమ్మవారి అంగీకారంతో తిరిగి బహుధాయాత్రను చేస్తూ జగన్నాథుడు సుభద్రను, బలభద్రుడిని తీసుకొని పూరీక్షేత్రాన్ని తిరిగి వస్తాడు. అధరణాభోగమనే తీయటిపానీయాన్ని భగవంతునికి సమర్పించి దానిని ప్రసాదంగా భక్తులకు అందచేస్తారు. ఈగుడిలోనే కాయక వైకుంఠం అన్నచోట క్రితం జగన్నాథునిగా ఉన్న మూర్తులకు అగ్నిసంస్కారాలు చేసి తిరిగి జగన్నాథునితో సహా బలభద్రుని, సుభద్రలను కొత్త దారువుతో తయారుచేసిన మూర్తులను ప్రతిష్ఠిస్తారు. ఇలా చేయడానే్న నవకళేబ రోత్సవం అంటారు. పరమశివుడు క్షేత్రపాలకుడుగా ఉన్న ఈ క్షేత్రంలోని జగన్నాథునికి అన్నం పరబ్రహ్మమంటూ ప్రత్యేకమైన అన్ననివేదన జరుగుతుంది. దీన్ని అరుదైన ప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు. ఈపూరీ జగన్నాథుని దర్శనం సర్వశుభకరం.

- చోడిశెట్టి శ్రీనివాసరావు