నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరములు నీకు మ్రొక్కులిడ గన్నులు మిమ్ము నె జూడ జిహ్వమీ
స్మరణ దలిర్ప, వీనులు భవత్క్ధలన్ వినుచుండ, నాసమీ
యరు తను బెట్టు పూసరుల కాసగొనం, పరమార్థ సాధనో
త్కరమిది చేయవే కృపను దాశరథీ కరుణా పయోనిధీ
భావము:దశరథరామా! నీవు దయతో నా చేతులు నీకు నమస్కరించునట్లు చేయుము. నా కన్నులు దర్శించునట్లు నాలుకతో మీ నామస్మరణ చేయునట్లు, చెవులు నీ సత్క్థలను వినునట్లు, ముక్కు మీ మెడలో వేసిన పూలదండల వాసనలకు ఆశపడునట్టు చేయుము. ఈ అవయవముల పరమార్థము ఇటువంటి పనులకే కానీ మరొకటి చేయడానికి కాదు. పరమ పురుషార్థమైన మోక్షాన్ని సాధించడానికి సాధనాలవుతాయి. కనుక ఇలాంటి అనుగ్రహము కలిగింపుము.
దాశరథీ శతకములోని పద్యము