నల్గొండ

ఈ పాపం ఎవరిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, జూన్ 23: దేవరకొండ డివిజన్‌లో మానవత్వాన్ని మంటగలిపే సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు దేవరకొండ నియోజకవర్గంలోని పలు గిరిజన తండాల్లో ఆడశిశువులను హతమార్చడం, అనాథలుగా వదిలేయడం లాంటి ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే నేరెడుగొమ్ము మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మేఘావత్‌తండాలో గురువారం రోజు ముళ్ళపొదల్లో పాటిపెట్టిన మగశిశువు మృతదేహం లభ్యం కావడం సంచలనం కలిగించింది. అక్రమ సంతానమో లేక అధిక సంతానమో కారణమేమైతేనేమి నిండు నూరేళ్ళు బతకాల్సిన చిన్నారి ముళ్ళ పొదల్లో శవంగా కనిపించింది. మేఘావత్‌తండాకు చెందిన వారే శిశువును పూడ్చిపెట్టారా? లేక ఇతర ప్రాంతవాసులెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది. తండాలో ఇటీవల కాన్పు అయిన వారెవరు, అంగన్‌వాడీ రికార్డు ప్రకారం గర్భిణీలుగా నమోదైన వారు ఎంత మంది, వారిలో ఎంత మంది కాన్పు చేయించుకున్నారు అన్న విషయాలను తెలుసుకునేందుకు ఐసిడిఎస్ అధికారులు శుక్రవారం మేఘావత్‌తండాల్లో ఇంటింటికి తిరిగి వివరాలను సేకరించారు. ఆరుగురు సూపర్‌వైజర్లు, 15 మంది అంగన్‌వాడీ కార్యకర్తలతో శుక్రవారం తండాలో ఇంటింటికి తిరిగి వివరాలను సేకరించారు. అయితే రికార్డులో నమోదైన వివరాల ప్రకారం గర్భిణీలు, కాన్పు అయిన వారంతా సురక్షితంగానే ఉన్నారని సిడిపివో సక్కుబాయి చెప్పారు. లభ్యమైన మగశిశువు వయస్సు దాదాపు వారం రోజులు ఉంటుందని శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు అభిప్రాయపడ్డారని సిడిపివో సక్కుబాయి చెప్పారు. శిశువు ఎవరు, తల్లిదండ్రులు ఎవరు అన్న విషయాలను తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని సిడిపివో సక్కుబాయి చెప్పారు. శిశువు తల్లిదండ్రులను కనుగొనేందుకు శిశువు మృతదేహం నుండి బోన్స్‌ను సేకరించినట్లు ఆమె చెప్పారు.