నల్గొండ

పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 23: పాఠశాలలు పునఃప్రారంభమైనందునా తరగతులు సక్రమ నిర్వాహణకు అవసరమైన వసతులు కల్పించేందుకు విద్యాశాఖ అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్ సూచించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన నాల్గవ స్థాయా విద్యా, వైద్య సంఘం, రెండో స్థాయా గ్రామీణాభివృద్ధి సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు సకాలంలో విద్యార్థులు అందించాలని, గత ఏడాది జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పి అందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదంటు బాలునాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్స్‌లో కూడా వసతుల కల్పనకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. గురుకుల పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది కొరత, వసతుల కొరత లేకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నారు. క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందించపోవడం పట్ల చైర్మన్ క్రీడాశాఖ అధికారులను మందలించారు. ఖాదీ రుణాల పంపిణీ, ఉపాధి హామీ పథకం అమలులో జాప్యం లేకుండా గ్రౌండింగ్‌చేయాలన్నారు. మహిళ సంఘాలకు రుణాల మంజూరులో కొన్ని బ్యాంకులు జాప్యం చేస్తుండటంపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిప్పర్తి జడ్పీటిసి తండు సైదులు మాట్లాడుతూ పిహెచ్‌సిలో వైద్యులు అందుబాటులో లేక ఆటోలో మహిళ ప్రసవించిన ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నించారు. డిఎంహెచ్‌వోతో పాటు పలు శాఖల జిల్లా అధికారులు గైర్హాజర్ కావడం, నివేదికలు ఇవ్వకపోవడం పట్ల సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కెసిఆర్ కిట్ పథకం అమలవుతున్నందునా ఆసుపత్రులకు వచ్చే గర్భిణులకు వైద్య వసతులు అందించేందుకు, ప్రసవాలకు అవసరమైన గైనకాలజిస్టులు భర్తీ చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో సీజనల్ వ్యాధులతో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వైద్య సేవలందించడంలో వైద్యుల పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. ఉద్యాన వన శాఖ నుండి రైతులకు బత్తాయి మొక్కలు అందడం లేదని, అలాగే పథకాల మంజూరులో, దొండ సాగు చేపట్టిన రైతులకు బిల్లుల చెల్లింపులో జాప్యం సమస్యలను పరిష్కరించాలని సభ్యులు కోరారు. పరిశ్రమల శాఖ నుండి లబ్ధిదారులకు సబ్సిడీ సకాలంలో అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సిఈవో హనుమానాయక్, పరిశ్రమల శాఖ అధికారి కోటేశ్వర్‌రావు, డిఆర్‌డిఐ ఆర్. అంజయ్య, జడ్పీటీసిలు పరమేష్, మల్లేశం, హరినాయక్, శివాజీ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.