నల్గొండ

నీట్ ఫలితాల్లో నల్లగొండ విద్యార్థుల ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జూన్ 23: నీట్-2017్ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులను ఇంటర్ నుండి నేరుగా మొదటి ప్రయత్నంలో సాధించడం ద్వారా నల్లగొండ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ఆరు ర్యాంకులను సాధించగా పులిపాటి వాణి 569మార్కులతో 7055వ ర్యాంకును సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. కె. వీణ 536 మార్కులతో 14600ర్యాంకు, పి.నవీన్ 505మార్కులతో 24,233ర్యాంకు, బి.చేతన 39057, జె.ప్రణతి 40420ర్యాంకు, కె.శ్రీకృతి 82,335ర్యాంకును సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, సహకరించిన అధ్యాపక బృందాన్ని కళాశాల చైర్మన్ చందా కృష్ణమూర్తి, డైరక్టర్లు నరేందర్‌బాబు, శశిధర్‌రావు, చందా శ్రీనివాస్, పైళ్ల రమేష్‌రెడ్డి అభినందనలు తెలిపారు.