అదిలాబాద్

ఏజెన్సీలో హరితహారాన్ని విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, జూన్ 23: మూడోవిడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏజెన్సీలో లక్ష్యం మేరకు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి అన్నారు. శుక్రవారం డిఆర్‌డివో, అటవీ శాఖ, హర్టికల్చర్ అధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేయగా నర్సరీలోని మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సంధర్భంగా డి ఆర్‌డివో ద్వారా లక్ష టేకు మొక్కలు పెంచడం జరిగిందని పిడి రాజేశ్వర్ కలెక్టర్‌కు వివరించారు. అదే విధంగా మరో లక్ష టేకు మొక్కలు హర్టికల్చర్‌లో పెంచుతున్నాని, అటవీ శాఖ అధ్వర్యంలో కొండమామిడి, నిలగిరి, నెమలినార, కానుగ, టేకు, నల్లమద్ది, సీతాఫలం వంటి మొక్కలను పెంచుతున్నట్లు ఎఫ్‌ఆర్‌వో రమేష్‌రావు తెలిపారు. ఈ సంధర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏజెన్సీ వ్యాప్తంగా పెంచిన మొక్కలను నాటించి వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. ప్రతి మొక్కకు లెక్కలు ఉండాలని, వాటిని తనకు నివేదిక ద్వారా ఎక్కడెక్కడా నాటారో తెలుపాలని అన్నారు. నిర్లక్ష్యం వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ప్రాంగణం, హర్టికల్చర్ ప్రాంగణంలో నర్సరీలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.