అదిలాబాద్

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్నూర్, జూన్ 23: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా వైద్యాధికారి రాజీవ్‌రాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగుల రిజిస్టర్‌ను పరిశీలించడంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్ళి వారికి అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్యులు ఎళ్ళప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యచికిత్సలు అందించాలన్నారు. వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాల, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సంధర్భంగా ప్రాథమిక ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని జిల్లా వైద్యాధికారికి తెలుపగా ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్ళి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు ప్రజలకు పరిరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. ఆయనతో పాటు ఏజెన్సీ అడిషనల్ డిఎంఆండ్‌హెచ్‌వో వసంత్‌రావు, డాక్టర్ సుమన్ తదితరులు ఉన్నారు.