అదిలాబాద్

మైనార్టీల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా రూరల్, జూన్ 23: మైనార్టీల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ముధోల్ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి అన్నారు. భైంసా పట్టణంలో రంజాన్ పండుగను పుస్కరించుకుని ముస్లీం సోదరులకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. మైనార్టీ సోదరులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం మైనార్టీ వర్గాల వారికి పండుగను పురస్కరించుకుని ఆధికారికంగా ఇఫార్ విందులను ఏర్పాటు చేస్తుందని అన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో, గ్రామాల్లో ముస్లీం సోదరులకు రంజాన్ తోఫాను అందిస్తుందని తెలిపారు. ప్రార్థన స్థలాల అధునికరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. ముస్లీం సోదరులు రంజాన్ పర్వదినం ఘనంగా జరుపుకోవడానికి ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు అధునిక, నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మైనార్టీ వర్గాల విద్యార్థులు, విద్యార్థినులకు విద్యను అందిచడానికి అన్ని వసతులతో కూడిన గురుకులాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని భైంసా పట్టణంలో గత సంవత్సరం మైనార్టీ వర్గాలకు చెందిన బాలుర గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశామని అన్నారు. అదేవిధంగా కుభీర్ మండలంలో సహితం బి సి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వెల్లడించారు. ఒక్కొక్క విద్యార్థిపై సంవత్సరానికి ప్రభుత్వం 1.25లక్షల రూపాయలను ఖర్చు చేస్తుందని అన్నారు. అదేవిధంగా మైనార్టీ విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన ఉపకారవేతనాలను అందించేందుకు చర్యలు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. విద్యార్థులు, విద్యార్థినులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోషకులు సహితం విద్యార్థినులకు గురుకుల పాఠశాలలో చేర్పించాలని అన్నారు. పండుగలు ప్రజల ఐక్యతకు ప్రతీకలని తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందుల్లో ఎమ్మెల్యే పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో భైంసా ఎఎంసి చైర్మన్ గౌర శ్రీనివాస్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.