అదిలాబాద్

కడెంలో ఈదురుగాలులతో కురిసిన భారీ ర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, జూన్ 23: మండల కేంద్రమైన కడెంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి పలు ఈదురుగాలులతో భారీవర్షం కురిసింది. ఒకేసారి ఈదురుగాలులు వీయడం, మరోపక్క వర్షం కురియడంతో మండల కేంద్రమైన కడెం,పెద్దూర్ సమీపంలో ఈదురుగాలులు వీయడంతో ప్రధానవిద్యుత్ తీగలపై కొమ్మలు పడడంతో దాంతో విద్యుత్‌స్థంభాలు విరిగి నేలకొరిగాయి. ప్రధాన మేయిన్‌లైన్ విద్యుత్ తీగలు, విద్యుత్‌స్థంభాలు విరిగి పడడం వల్ల రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో కడెం,దస్తురాబాద్ మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు అంధాకారంలో మగ్గారు. విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది శుక్రవారం ఉదయం విరిగిపోయిన విద్యుత్‌స్థంభాల స్థానంలో కొత్త విద్యుత్ స్థంబాలను అమర్చి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు పునరుద్దరించారు. అలాగే కడెంలోని పోచమ్మతల్లి ఆలయంపై ఈదురుగాలులు, వర్షం కురియడంతో భారీ వృక్షం ఆలయంపై పడింది. రాత్రి సమయంలో ఈదురుగాలులతో వర్షం రావడం వల్ల పలు ఇండ్లపైకప్పులు లేచిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మండలంలో ఈదురుగాలులు, వర్షంతో కొద్దిపాటి నష్టం వాటిల్లిన కొన్ని రోజుల నుండి ఎండవేడిమి తట్టుకోలేక ఉపశమనం లభించింది. వర్షం కురియడంతో పలు గ్రామాల రైతులు తమ ఖరీఫ్‌లో పంట పనులను ముమ్మరం చేశారు.