మహబూబ్‌నగర్

భూసార పరీక్షలతోనే కొత్త ప్రయోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 23: భూసార పరీక్షల ద్వారా కొత్తకొత్త ప్రయోగాలు చేయాలని వ్యవసాయ అధికారులను మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కోరారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాలు, ఎంఇఓ, ఎఇఓల భూసార పరీక్షల శిక్షణ శిబిరాన్ని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఎమ్మెల్యే ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలోనే విత్తన బండాగారం తెలంగాణ అని అన్నారు. దేశ వ్యాప్తంగా విత్తనాలు సరఫరా ఎక్కువ తెలంగాణ నుండే జరుగుతుందని గుర్తుచేశారు. ఇక్కడి వాతావరణంతో పాటు ఇక్కడి భూము విత్తనాలకు వివిధ రకాల పంటలకు అనుకూలమైన ప్రాంతం అని అన్నారు. గతంలో భూసార పరీక్షలు చేసే వారు ఉండేవారని ఏదో ఒక గ్రామంలో తూతూ మంత్రంగా చేసి అన్ని భూములు ఇదేమాదిరిగా ఉన్నాయని అప్పటి ప్రభుత్వాలు రైతులను మోసం చేశాయని అందుకే రైతులు తెలంగాణలో వ్యవసాయం చేసి అప్పుల పాలు అయ్యారని అన్నారు. వ్యవసాయం చేయాలంటే నీరు ఉండాలని అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. గతంలో కృష్ణానదిలో వరద వస్తే 80 శాతం నీరు కిందకు వెళ్లేదని ప్రస్తుతం అలా కాకుండా జూరాల ప్రాజెక్టుకు ఎంతనీటి వరద వస్తే అంత కోయిల్‌సాగర్ ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులోకి నీరు నింపడం జరుగుతోందని, ఇలా గత పాలకులు ఎప్పుడు ఆలోచన చేయలేదన్నారు. భూసార పరీక్షలు అంటే వైద్యంలాంటిదేనని వ్యవసాయ అధికారులు సైతం భూమి వైద్యులు అన్నారు. ప్రస్తుతం జిల్లాలో 60 కిట్ల ద్వారా భూసార పరీక్షలు ముందుగా నిర్వహించడం జరుగుతుందని ఆ కిట్లు ఇప్పటికే వచ్చాయని అన్నారు. రైతు బాగోగుల గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం భూసార పరీక్ష కేంద్రాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. గత సంవత్సరం 60 వేల క్వింటాళ్ల కందులు జిల్లాలో కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ అధికారులు ప్రస్తుతం ఒకటి రెండు గ్రామాలకు ఒకరు ఉన్నారని వారికి కేవలం తమ పరిధిలోని రైతుల భూములను గుర్తించేలా ఉండేలా తయారు కావాలని అన్నారు. ఫలాన రైతు భూమి ఎక్కడ ఉందని అడిగితే వెంటనే చెప్పేలా అవగాహన రావడానికి ఏఇఓల నియామాకం ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. ప్రతి ఏడాదికి మనిషికి రెండు మార్లు వైద్య పరీక్షలు ఎలా చేసుకుంటారో భూమికి కూడా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని రైతులకు ముందుగా అవగాహన కల్పించాలన్నారు. భూసార పరీక్షలు ఎంతో అవసరం అన్న విషయాన్ని ప్రతి రైతుకు తెలియజేసి నప్పుడే తన పొలం ఎలాంటి పంటలు సాగుచేస్తే దిగుబడి వస్తుందన్న విషయం అర్థం అవుతుందని తెలిపారు. గోదాంల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, అంతేకాకుండా కోల్డ్‌స్టోరేజీలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టుతుందని అందులో భాగంగానే ఎలక్ట్రికల్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెంటింగ్( ఈనాం) అలాంటి వ్యవస్థను సైతం బలోపేతం చేసి రైతులకు అండగా నిలవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. ఈ సమావేశంలో జెడి సుచరిత, జాయింట్ డైరెక్టర్ రాములు, ఏరువాక కేంద్రం సుధరాణి, మార్కెట్‌కమిటి చేర్మన్ రాజేశం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.