మహబూబ్‌నగర్

కుల వృత్తుల ప్రోత్సాహమే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరచింత, జూన్ 23: ఆదరణ కరువైన కుల వృత్తులను ప్రోత్సహించడమే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కుంకనివానిపల్లి గ్రామంలో గొల్ల కురుమ సోదరులకు గొర్రెపిల్లలను పంపిణీ చేసి మాట్లాడారు. స్వాతంత్రం అనంతరతం పాలించిన ప్రభుత్వాలు కుల వృత్తులపై చిన్న చూపు చూడడంవల్ల గొల్ల గరుములు, ముదిరాజులు, కుమ్మరి, వడంగ్రి, నాయి బ్రహ్మాణులు, చేనేత కార్మికులు పూర్తిగా వెనకబడిపోయారని వారిని ఆర్థికంగా ఏదిగేందుకు 75 శాతం సబ్సిడీతో వారిని ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిచారని తెలిపారు. పశువైద్యశాఖ జిల్లా జెడి విజయ్‌రాజు మాట్లాడుతూ గ్రామంలో మొత్తం 48 మంది డిడిలు చెల్లించగా 14 మంది లబ్ధిదారులకు ప్రస్తుతం గొర్రెపిల్లలను ఇవ్వడం జరిగిందన్నారు. త్వరలోనే మిగతా వారికి ఇవ్వడం జరగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ మాసన్న అధ్యక్షత వహించగా తహశీల్దార్ దత్తత్రీ, పశువైద్యులు వెంకటేష్, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజు, రవికుమార్‌యాదవ్ తదితరులు ఉన్నారు.