మహబూబ్‌నగర్

రైతులకు వెంకయ్య క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, జూన్ 23: ప్రభుత్వం రుణమాఫీ చేయాలని రైతులు కోరడం ఒక ఫ్యాషన్‌గా మారిందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రైతులను కించపరిచే విధంగా మాట్లాడారని అందుకు ఆయన రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎఐసిసి కార్యదర్శి, వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం వనపర్తిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చిన్నారెడ్డి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో, రైతు కుటుంబంలో పుట్టిన వెంకయ్య నాయుడు రైతుల పక్షాన నిలిచి వారికి అండగా నిలవాల్సి ఉండగా వారిని కించపరుస్తూ మాట్లాడటం తగదని ఆయన అన్నారు. అన్ని శాఖల గురించి మాట్లాడటంతో పాటు ప్రధాని చేసే పనులను కూడా చెప్పే ముఖ్య స్థానంలో ఉన్న వెంకయ్య నాయుడు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో చొరువ చూపకుండా రైతులకు వ్యతిరేకంగా మాట్లాడారని ఆయన విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమేనని ఈ ఏడాది గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వారి తప్పులను కప్పి పుచ్చుకోవడానికి రైతుల పైనే మాట్లాడటం మానుకోవాలని ఆయన అన్నారు. క్వింటాల్‌కు రైతుకయ్యే పెట్టుబడికంటే గిట్టుబాటు ధర తక్కువగా ఉంటే రైతు అప్పుల పాలు కాక మరేమి మిగులుతుందని ఆయన ప్రశ్నించారు. వరి క్వింటాల్‌కు రూ.2158లు ఖర్చు కాగా రూ.1550 గిట్టుబాటు ధర కల్పించారని ఆయన విమర్శించారు. స్వామినాథన్ కమిటి చెప్పిన ప్రకారం పెట్టుబడికి అయ్యే ఖర్చులో 50శాతం అధనంగా గిట్టుబాటు ధర ఉండాలని చెప్పారన్నారు. స్వామినాథన్ కమిటి సిఫారసులను అమలు చేయకుండా రైతులను అప్పుల ఊబిలోకి నెట్టి రుణమాఫీ ఎలా అడుగుతారని ప్రశ్నించడం హస్యాస్పదమని అన్నారు. రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, విదర్భ తరువాత తెలంగాణ రాష్టమ్రే ముందుందని అన్నారు. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల ఆధాయాన్ని రెండింతలు చేస్తామని చెబుతుండగా మంత్రి వెంకయ్య నాయుడు రైతులకు వ్యతిరేకంగా మాట్లాడటం మంచిది కాదన్నారు. విధానాలు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో రైతులు తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. వనపర్తికి వాటార్‌గ్రీడ్ సర్కీల్ కార్యాలయం మంజూరు చేయడం పట్ల ప్రభుత్వానికి అందుకు కృషి చేసిన వాటార్‌గ్రీడ్ చీఫ్ సురేందర్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్‌ప్రసాద్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్, ధనలక్ష్మి, భువనేశ్వరి, విజయలక్ష్మి, రాగివేణు తదితరులు పాల్గొన్నారు.