విజయనగరం

జిఎస్‌టితో అక్రమాలకు అడ్డుకట్ట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 23: దేశ వ్యాప్తంగా మరో వారం రోజుల్లో జిఎస్‌టి అమల్లోకి రానుంది. జిఎస్‌టి(వస్తు సేవల పన్ను) అమలుతో నగదు లావాదేవీల్లో అక్రమాలకు అడ్డుకట్టపడనుంది. ఇప్పటివరకు ఒకే లావాదేవీకి వివిధ రకాల పన్నులను వ్యాపారులు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు జిఎస్‌టి అమలుతో ఒక్కసారి పన్ను చెల్లిస్తే సరిపోతుంది. గతంలో వ్యాట్ అమల్లో ఉన్నప్పుడు ఒక లావాదేవికి సెంట్రల్ ఎక్సైజ్, సిఎస్‌టి, ఆర్‌డి సెస్సు, సర్వీసు టాక్స్ ఇలా వివిధ రకాలుగా పన్ను చెల్లించాల్సి వచ్చేది. అలాంటి పన్నులను కలిపి ఒకే పన్ను విధానంలోకి తీసుకువచ్చారని వాణిజ్య పన్నులశాఖ అసిస్టెంట్ కమిషనర్ పి.సత్యకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జిఎస్‌టిపై వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎవరిపైనా అపరాధ రుసుములు ప్రస్తుతం విధించడం లేదని స్పష్టం చేశారు. వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఏటా రూ.20 లక్షల టర్నోవర్ కలిగిన వ్యాపారులు జిఎస్‌టి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రూ.20 లక్షలు దాటిన వారు తప్పనిసరిగా జిఎస్‌టి పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. వ్యాపారులు రూ.20 లక్షల నుంచి రూ.70లక్షలు టర్నోవర్ కలిగిన వ్యాపారులు 3 నెలలకోమారు రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం జూలై నెలకు సంబంధించిన రిటర్న్ ఆగస్టులో 3బి కింద సింపిల్ రిటర్న్ దాఖలు చేస్తే సరిపోతుందన్నారు. ఆ తరువాత వివరంగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
నాలుగు రకాల పన్నులు : ప్రస్తుతం జిఎస్‌టి పరిధిలో నాలుగు రకాల పన్నులు ఉన్నాయని ఎసి సత్యకుమార్ తెలిపారు. వాటిలో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం పన్నులు ఉన్నాయన్నారు. వాటిలో 70 శాతం వ్యాపారాలు 18 శాతంలోపు పన్నులే వర్తిస్తున్నాయన్నారు. ప్రస్తుతం వ్యాపారులు ఉపయోగిస్తున్న ప్రొవిజినల్ ఐడిని జిఎస్‌టి ఐడి కింద వాడుకోవచ్చన్నారు. ఇక వస్త్ర వ్యాపారులు 5 శాతం పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం జిఎస్‌టి కౌన్సిల్‌లో ఉందన్నారు. బియ్యం, అపరాలు బ్రాండెడ్ వాటిపై పన్ను ఉంటుందన్నారు. బ్రాండెడ్ కాని వాటికి పన్ను ఉండదని స్పష్టం చేశారు. వర్క్ కాంట్రాక్ట్ సేవా రంగంలోకి తీసుకున్నారని, భవనాలు, అపార్ట్‌మెంట్లకు 12 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. రోడ్లు, కాలువలు ఇతర వాటికి 18 శాతం చెల్లించాల్సి ఉంటుందన్నారు.
రవాణాలో జాప్యం నివారణ : గతంలో సరకుతో ఏ వాహనం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన చెక్‌పోస్టుల వద్ద ఒకటి, రెండు రోజులు ఉండాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదన్నారు. ఎంట్రీ పాయింట్ వద్ద సర్ట్ఫికెట్ తీసుకుంటే అదే సరిపోతుందన్నారు. ఇదిలా ఉండగా వ్యాపారులు, డీలర్లకు అవగాహన కల్పించేందుకు కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. విజయనగరంలోని వాణిజ్య పన్నుల కార్యాలయంలోనూ, పార్వతీపురం, బొబ్బిలిలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు.