విజయనగరం

పరిశ్రమలు నెలకొల్పే వారికి ప్రోత్సాహకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 23: రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పదలచుకున్న వారికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తోందని జాయింట్ కలెక్టర్ కె.నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక హోటల్‌లో జిల్లా పరిశ్రమల కేంద్రం సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఇ దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువత పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే అన్ని రకాల అనుమతులను 15 రోజుల్లో మంజూరు చేస్తుందన్నారు. చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అత్యున్నత స్థాయికి ఎదిగిన పారిశ్రామిక వేత్తలు ఎందరో ఉన్నారన్నారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబురాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా వివిధ పరిశ్రమలకు ప్రభుత్వం మంజూరు చేసిన రాయితీలను జెసి కె.నాగేశ్వరరావు, ఎంవిజిఎఆర్ కళాశాల ప్రిన్సిపాల్ కెవిఎల్ రాజు, ఎస్‌బిఐ ఆర్‌ఎం శ్రీనివాసరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఎస్‌బిఐ ఆర్‌ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాలు అనేక రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తున్నాయన్నారు. పరిశ్రమల స్థాపనకు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించినప్పుడు బ్యాంకులు ఎక్కువ మొత్తాల్లో రుణాలు అందిస్తాయన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎం.ఉదయ్‌భాస్కర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. సూక్ష్మ పరిశ్రమలను రూ.25 లక్షల వరకు, చిన్నతరహా పరిశ్రమలు రూ.25 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు, మధ్య తరహా పరిశ్రమలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు, సర్వీసు ఆధార పరిశ్రమల ఆధారంగా సూక్ష్మ పరిశ్రమలకు రూ.10 లక్షల వరకు, చిన్నతరహా పరిశ్రమలకు రూ.10 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు, మధ్యతరహా పరిశ్రమలకు రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఉన్నాయన్నారు. ఆయా పరిశ్రమల స్థాపనకు 11 రకాల అనుమతులను సింగిల్ డెస్క్ విధానం ద్వారా 15 రోజుల్లో అందజేస్తుందన్నారు. జిల్లాలో రూ.2909.96 కోట్ల పెట్టుబడిగల 43 భారీ, పెద్ద పరిశ్రమలు, స్టీల్, ఫెర్రో ఎల్లాయిస్, ఫార్మా, చక్కెర, కెమికల్, జీడిపప్పు ప్రోసెసింగ్‌లద్వారా 24025 మందికి ఉపాధి కల్పించామన్నారు. నెల్లిమర్ల, గజపతినగరం, ఎస్‌కోట నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కావాల్సిన లక్షణాలు, పరిశ్రమల స్థాపనలో స్థూల అంశాలు, ఉత్పత్తులు, సర్వీసుల ఎంపిక, ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాల అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం డిడిఆర్ పాపారావు, ఎల్‌డిఎం టి.గురవయ్య, నాబార్డు ఎజిఎం హరీష్, ఎపిఎస్‌ఎఫ్‌సి బిఎం వెంకటరావు, ఎంఎస్‌ఎంఇ ఎడి సంతోష్‌కుమార్ సాహు, ఎపిఐఐసి కమిషనర్ ఎంవి కరుణాకర్, ఆంధ్రాబ్యాంకు డిజిఎం రాధాకృష్ణమూర్తి, ఎపిజివిబి ఆర్‌ఎం సుదీర్ రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చలం, ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ కెవిఎల్ రాజు, నెల్లిమర్ల పరిశ్రమల సంఘం కార్యదర్శి ప్రవీణ్, ఎం. రామలింగం, రమణమూర్తి, డిఐసి ఎడి ఆర్ పాండురంగారావు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.