మెదక్

విధులకు డుమ్మాకొట్టిన తహశీల్దార్, విఆర్‌ఓ సస్పెన్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 23: విధులకు గైర్హాజరైతూ విధులపట్ల నిర్లక్ష్యం వహించిన హుస్నాబాద్ డివిజన్ మద్దూర్ మండలం తహశీల్దార్ కోహెడ మండల విఆర్‌ఓలు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మద్దూర్ మండల తహశీల్దార్ విక్రం ఈనెల 13నుంచి విధులకు హాజరు కాకపోవడం వల్ల ప్రజలు, విద్యార్థులకు సరైన సమయంలో సేవలందించలేకపోయారన్నారు. హుస్నాబాద్ ఆర్డీఓ నివేదిక అనుసరించి సిసిఏ రూల్స్ ప్రకారం క్రమశిక్షణ చర్యలకింద సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. కోహెడ మండలం విఆర్‌ఓ రవితేజ ఏప్రిల్ 19నుంచి విధులకు గైర్హాజరవుతున్నారన్నారు. వర్కోల్ విఆర్‌ఓ దాసరి కుమారస్వామి ప్రభుత్వ ముఖ్యకార్యక్రమం సాదాబైనామా అమలులో అశ్రద్ధవహిస్త్తూ సక్రమంగా విధులు నిర్వహించకుండా ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకపోవడంతో సిసిఏ రూల్స్‌ప్రకారం క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఫ్రతి ఉద్యోగి తమ విధులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.