మెదక్

మైనార్ట్టీల సంక్షేమానికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సాపూర్,జూన్ 23: రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం మైనార్టిల సంక్షేమం కోసం పని చేస్తుందని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. శుక్రవారంనాడు నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌లోని మణికొండ ఫంక్షన్ హల్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రాజమణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ముస్లిం మత గురువు సమీయోద్దీన్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టిలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని సూచించారు. నర్సాపూర్‌లోని పేద ముస్లింలకు 300 కుట్టు మిషన్లు అందించనున్నట్లు అదేవిధంగా పట్టణంలో 50లక్షలతో బట్టర్ ప్ల్రై లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నర్సాపూర్‌లోని పేద ఇళ్లులేని ముస్లింలందరికి డబల్‌బెడ్‌రూం ఇళ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. జడ్పిటిసి కమల, నాయకులు అశోక్‌గౌడ్, హబీబ్‌ఖాన్, మల్లేశ్‌యాదవ్, నాగేష్, భిక్షపతి, జాఫర్ అలి, వీరేశం, చంద్రశేకర్, నరేందర్‌రెడ్డి, రాజేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.