మెదక్

ఎంపిడిఓల పర్యవేక్షణలోనే హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూన్ 23: హరితహారం కార్యక్రమాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు స్వీయ పర్యవేక్షణలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల పరిషత్తు అభివృద్ధి అధికారులు, ఈఓపిఆర్‌డిలు, ఎపిఓలు, ఎపిఎంలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారంలో నర్సరీల నుండి మొక్కలు తీసుకుకునే దగ్గర నుండి వాటి సంరక్షణ, పర్యవేక్షణ మండల పరిషత్తు అభివృద్ధి, నోడల్ అధికారులే నిర్వహించాలని ఆదేశించారు. నర్సరీల వారీగా ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో తెలుసుకోవాలని, నాటే మొక్కలు, వాటి పెరుగుదల బట్టి బ్లాక్ వారీగా క్లోడికరించడం జరుగుతుందన్నారు. బ్లాక్ వన్ మొక్కలను జూలై మొదటి వారంలో నాటేందుకు సిద్ధం చేయాలన్నారు. ఈ నెల 26నుండి పూర్తి స్థాయిలో అన్ని చోట్ల గుంతలు తీసే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. సమావేశంలో డిపిఓ వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఓ ఎఓ సిద్దారెడ్డి, ఎంపిడిఓలు, ఈఓపిఆర్‌డిలు, ఎపిఓలు, ఎపిఎంలు పాల్గొన్నారు.