మెదక్

ప్రభుత్వం వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జూన్ 23: తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ విధానం ప్రకటించాలని టి జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. అమరవీరుల స్పూర్తి యాత్రలో భాగంగా శుక్రవారం మెదక్ రాందాస్ చౌరస్తాలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. రైతులకు ప్రకటించిన రుణమాఫిని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమరవీరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని కోదండరాం గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో లాభం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఆశించారన్నారు. కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వ పాలన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఆశించిన విధంగా పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని ఆయన తెలిపారు. రైతులు కందులు పండించారు వాటికి ధర లేదు, కేవలం క్వింటాల్‌కు 4500 వరకే ధర ఉండటంతో కందుల రైతులకు పెట్టుబడులు కూడా రాలేదన్నారు. మూడు సంవత్సరాల తెలంగాణ పరిపాలనలో రైతులకు పండించిన పంటలపైన ఐదు వేల కోట్లు నష్టం భరించారని కోదండరాం తెలిపారు. మిర్చి రైతులకు కూలీ ధరలు కూడా రాలేదన్నారు. మిషన్ భగీరథలో చాలా కుంభకోణం ఉందన్నారు. వేసిన పైప్‌లను మల్లి వేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కాంట్రాక్టర్లకు మాత్రం బ్యాంక్‌లలో నిధుల కొరత లేదని ఆరోపించారు. ఖరీప్ సీజన్ వచ్చింది, రైతులు దాచుకున్న డబ్బు అక్కరకు రావడం లేదని ఆయన తెలిపారు. అందుకే రైతులకు వ్యవసాయ విధానం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో హైదరాబాద్‌లో ధర్నా చేసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. దాంతో హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగిందని ఆయన తెలిపారు. ఆత్మహత్యలు లేని ప్రభుత్వంగా నిర్మించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని ఆయన తెలిపారు. అందుకే ప్రభుత్వ విధానంలో స్పష్టత లేని ఎన్నికల హామీలను ఊరూర యాత్రలు చేసి ప్రజలకు వివరించాలని అమరవీరుల స్పూర్తి యాత్ర చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. రాజకీయ నాయకులు మాత్రం భూకబ్జాలకు ఎగబడుతున్నారని ఆరోపించారు. 92 శాతం గ్రామాల్లో ప్రజలు జీవిస్తున్నట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు బ్యాంక్‌ల ద్వారా రుణాలు ఇప్పించాలని, పండిన పంటలకు మంచి ధర కల్పించాలని, ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రభుత్వాన్ని ఈ సమస్యలపైన గట్టిగా అడగాలని, ప్రజా ప్రతినిధులను నిలదీయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రమైన మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో స్పెషలిస్ట్‌లు లేకపోవడం దురదృష్టకరమన్నారు. సంపూర్ణమైన మందులు కూడా కల్పించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మెదక్ జిల్లా అభివృద్దిలో భాగంగా వ్యవసాయదారులకు బతుకుదెరువు చూపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మనం ఓట్లు వేసి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము, అందుకే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వాన్ని నిలదీయాలని కోదండరాం ప్రజలకు పిలుపునిచ్చారు. రైతు కష్టాలు తీర్చాలని, అందరికి న్యాయం చేయాలని ఆయన పేర్కొన్నారు. మెదక్ ఎన్‌డిఎస్‌ఎల్‌ను తిరిగి ప్రారంభించి కార్మికులు, రైతులను కాపాడాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో టి జెఎసి జిల్లా చైర్మన్ సడిమెల యాదగిరి, దూడ యాదేశ్వర్, శిరిగ ప్రభాకర్, ఎంపిటిసి శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు.