నిజామాబాద్

కార్పొరేట్ శక్తుల కొమ్ముకాస్తున్న ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జూన్ 23: కార్పొరేట్ శక్తులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొమ్ముకాస్తున్నాయని భారతీయ మజ్దూర్ సంఘ్(బిఎమ్‌ఎస్)రాష్ట్ర కార్యదర్శి అల్లూరి రవీశంకర్ ఆరోపించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీశంకర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దేశాభివృద్ది కోసం సలహాలు సూచనలు ఇవ్వాలని ఏర్పాటు చేసిన ‘నీతి అయోగ్’ సంస్థ కోట్లాది మంది బడుగుల, కార్మికులకు నష్టం కల్గించే విధంగా వ్యవహరిస్తూ, కేవలం కార్పొరేట్ శక్తులకు, యాజమాన్యాలకు కొమ్ము కాస్తూ, వత్తాసు పలుకుతోందే తప్ప దాని వల్ల ఏలాంటి ప్రయోజనం లేదని ఆరోపించారు. కార్మిక శ్రేయస్సు కోరే మేధావులను ‘నీతిఅయోగ్’లో తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికిన రాష్ట్ర సిఎం కెసిఆర్ 5వేల పరిశ్రమలు మూతపడి, లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడి తీవ్ర ఇబ్బందులు పడ్తున్నప్పటికీ, వారి కష్టాలు, బాధలు మాత్రం సిఎంకు కన్పించకుండా పోయాయని ఎద్దేవా చేశారు. బిల్టు కంపెనీ, నిజాం దక్కన్ షుగర్స్, సిర్‌పూర్ పేపర్ మిల్లులు మూతపడి మూడేళ్లు అవుతోందని, కార్మికులు కుటుంబాలు అర్ధాకాలితో అలమటిస్తున్నాయని, సిఎం కెసిఆర్ మాత్రం ఇవన్ని ఏమి పట్టనట్లు బంగారు తెలంగాణ అంటూ తెలంగాణ రాష్ట్రంలో దృతరాష్ట్రుడి పాలన కొన సాగిస్తున్నారని ఆరోపించారు. ఈ ధర్నా ఆందోళన కార్యక్రమంలో బిఎమ్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి సందుగారి రవీందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, నాయకుడు లింగమాచారీ, షుగర్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్దాగౌడ్, ఆటో యూనియన్ నాయకులు నర్సింలు, సురేందర్ శ్రీనివాస్, తల్వార్, గాయిత్రీ షుగర్స్ నాయకులు దామోదర్‌రెడ్డి, గోవర్ధన్, రాజయ్య, ధర్మారెడ్డి, రాంచంద్రం, లింబాధ్రి, మహిపాల్, చంద్రవౌళి, బీడీ కార్మిక సంఘం నాయకులు, లింగంపేట్ ఆటో సంఘం నాయకులు పాల్గొన్నారు.