నిజామాబాద్

నగరంలో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక్‌నగర్, జూన్ 23: జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగరంలో భారీ చోరీ చోటుచేసుకుంది. అహ్మద్‌పురా కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లో గుర్తు తెలియని ఆగంతకులు లోనికి చొరబడి దాదాపు కిలో బంగారు ఆభరణాలు, 53వేల రూపాయల నగదుతో పాటు ఇతర విలువైన వస్తువులను అపహరించుకుపోయారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. అహ్మద్‌పురా కాలనీలోని హమీదియా మసీదు సమీపంలో నివాసం ఉండే మహ్మద్‌అబ్దుల్ జవ్వాద్ గత కొనే్నళ్ల నుండి ఉద్యోగ రీత్యా విదేశాల్లో(ఖతర్)లో పని చేస్తున్నాడు. సెలవుల్లో కొన్నాళ్ల పాటు స్వస్థలానికి వచ్చి వెళ్తుంటాడు. దీంతో ఇంట్లో అతని భార్య పర్వీన్, పిల్లలు మాత్రమే ఉంటున్నారు. గురువారం షబ్-ఎ-ఖదర్ (జాగరణ పండుగ) ఉండడంతో పర్వీన్ సాయంత్రం సమయంలో తన ఇంటికి తాళం వేసి, పిల్లలను తీసుకుని జిల్లా కేంద్రంలోనే ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఇంటికి తాళం వేలాడుతుండడాన్ని గమనించిన దుండగులు దానిని ధ్వంసం చేసి లోనికి చొరబడ్డారు. పర్సులో దాచి ఉంచిన బీరువా తాళాలను చేజిక్కించుకుని, అందులో దాచి ఉంచిన సుమారు 90తులాలకు పైగా బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి ఆభరణాలు, 53వేల రూపాయల నగదును అపహరించుకుని పారిపోయారు. గురువారం రాత్రంతా తల్లిగారింటి వద్ద జాగరణ చేసి, శుక్రవారం ఉదయం తన సొంత ఇంటికి చేరుకున్న పర్వీన్ చోరీ జరగడాన్ని గమనించి బావురుమంది. సమాచారం తెలుసుకున్న నిజామాబాద్ ఎసిపి ఆనంద్‌కుమార్, నగర సిఐ సుభాష్‌చంద్రబోస్, టూటౌన్ ఎస్‌ఐ ఆంజనేయులు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి, ఆధారాల కోసం అనే్వషణ జరిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని సిఐ సుభాష్‌చంద్రబోస్ తెలిపారు.