నిజామాబాద్

నేరాల నియంత్రణకే సిసి కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమ్‌గల్, జూన్ 23: గ్రామీణ ప్రాంతాల్లో నేరాల నియంత్రణ కోసమే సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్మూర్ ఎసిపి శివకుమార్ అన్నారు. శుక్రవారం భీమ్‌గల్ మండలంలోని బడాభీమ్‌గల్ గ్రామంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను ఎసిపి శివకుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిసి కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలకు పాల్పడిన వారిని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని త్వరితగతిన పట్టుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఇప్పటి వరకు ఆర్మూర్ డివిజన్‌లోని మోర్తాడ్, కమ్మర్‌పల్లి, వేల్పూర్, బాల్కొండ, భీమ్‌గల్ మండలాలతో పాటు మేజర్ గ్రామ పంచాయతీల్లోనూ సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిసి కెమెరాల ఏర్పాటుకు ఆయా మండలాలకు చెందిన వ్యాపారులు, గ్రామస్థులు తమవంతు ఆర్థిక చేయూత అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. బడాభీమ్‌గల్ గ్రామంలో సుమారు 4లక్షల రూపాయల వ్యయంతో సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎసిపి తెలిపారు. సిసి కెమెరాల ఏర్పాటుకు సహకరించిన బడాభీమ్‌గల్ విడిసికి, వ్యాపారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమ్‌గల్ జడ్పీటిసి సభ్యురాలు లక్ష్మి, సిఐ రమణారెడ్డి, ఎస్‌ఐ సుఖేందర్‌రెడ్డి, భీమ్‌గల్ వైఎస్ ఎంపిపి శివసారి నర్సయ్య, బడాభీమ్‌గల్ సర్పంచ్ స్వప్న గణేష్, ఎంపిటిసి సభ్యుడు పిట్ల దాసు, ప్రకాష్, సుంకరి రాజన్న, విడిసి సభ్యులు గంగన్న తదితరులు పాల్గొన్నారు.