వరంగల్

నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 23: నిరుద్యోగ యువతకు సేంద్రియ ఎరువులపై శిక్షణ ఇచ్చి బయోఫెర్టిలైజర్ విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలు కల్పించాలని మేనేజ్ సంస్థ డైరెక్టర్ జనరల్ ఉషారాణి సూచించారు. ఈ విక్రయ కేంద్రాల ఏర్పాటుకు ఎటువంటి లైసెన్సులు అవసరం లేదని చెప్పారు. క్షేత్రస్థాయి వ్యవసాయాధికారులు పంటలకు సోకే చీడపీడల నివారణపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పంటల దిగుబడిపై మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిపేందుకు ఫార్మర్స్ ట్రెండ్ ఇన్ఫో పేరిట ఒక వెబ్‌సైట్ త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. శుక్రవారం అర్బన్ కలెక్టరేట్ మీటింగ్ హాలులో చీడపీడల యాజమాన్య ప్రణాళికపై నిర్వహించిన జిల్లాస్థాయి వర్క్‌షాపునకు డైరెక్టర్ జనరల్ ఉషారాణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు వరంగల్‌లో బయో కంట్రోల ల్యాబ్ అందుబాటులో ఉన్న కారణంగా చీడపీడల నివారణపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు అవకాశం ఉందని చెప్పారు. వ్యవసాయశాఖ ఏర్పాటుచేసిన కిసాన్ కాల్‌సెంటర్ ద్వారా రైతులు తమ సందేహాలను, అనుమానాలను శాస్తవ్రేత్తల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందవచ్చని అన్నారు.
సీజన్‌ల వారీగా వేయవలసిన పంటలు, చీడపీడల నివారణకు తీసుకోవలసిన చర్యలపై శాస్తవ్రేత్తలు కరపత్రాలు రూపొందించి రైతులకు అందచేయాలని సూచించారు. అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి మాట్లాడుతూ పంటల వారీగా, గ్రామాల వారీగా క్షేత్రస్థాయిలో సర్వే జరిపి నివారణ చర్యల గురించి రైతులకు సూచనలు చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. రసాయన ఎరువుల వాడకం ద్వారా, సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా వచ్చే దిగుబడుల తేడాపై పూర్థిస్థాయి సమాచారాన్ని రూపొందిస్తే రైతులకు ఒక నిర్ణయానికి వస్తారన్నారు. రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ మాట్లాడుతూ ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని చీడపీడల నివారణ, సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించి ప్రోత్సహించాలని సూచించారు. భూసార పరీక్షల నుంచి పంటలు రైతుల చేతికి అందేవరకు వ్యవసాయ అధికారులు రైతులకు జాగ్రత్తలు సూచించాలని చెప్పారు. వరి, పత్తి, మిరప పంటలలో విచక్షణా రహితంగా క్రిమిసంహారక మందులు వాడటం వలన కలిగే అనర్థాల గురించి, సేంద్రీయ ఎరువుల నిర్వహణతో కలిగే ప్రయోజనాల గురించి మేనేజ్ సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్, ఎన్.ఐ.పి.హెచ్.ఎం డైరెక్టర్ విజయలక్ష్మి వివరించారు.
కార్యక్రమంలో వరంగల్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ రఘురాంరెడ్డి, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ ఉషారాణి, ఉద్యానశాఖ జాయింట్ డైరెక్టర్ సునీత, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ శివప్రసాద్ , తదితరులు పాల్గొన్నారు.