వరంగల్

రైతులపై కేంద్రం నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 23: రైతులు వ్యవసాయ రుణాల మాఫీకి డిమాండ్ చేయటం ఫ్యాషన్‌గా మారిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించటం తీవ్ర ఆక్షేపణీయమని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో రుణమాఫీని అమలు చేసిన కేంద్రం ఇతర రాష్ట్రాల్లో రైతులు రుణమాఫీ కోరితే పట్టించుకోకపోవటం శోచనీయమని అన్నారు. త్వరలో ఎన్నికలు జరిగే కర్ణాటకలో ఏ విధంగానైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బిజెపికి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ రుణమాఫీ ప్రకటించటంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు అందు కు నిదర్శనమని తెలిపారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో గండ్ర మాట్లాడుతు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులు పండిస్తున్న పంటలకు కనీస మద్దతుధర ప్రకటించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్రం ఆనుసరిస్తున్న విధానాల వల్ల వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. గిట్టుబాటు ధరలు లభించక తెలంగాణలోని మిర్చి రైతులు ఆందోళనబాట పడితే కేంద్రం ఆలస్యంగా ఐదువేల మద్దతుధర, రవాణ చార్జీల కింద మరో 1250రూపాయలు చెల్లించాలని ప్రకటించిందని, కానీ రైతుల నుంచి క్వింటాలు మిర్చి కూడా కొనుగోలు చేయలేకపోయిందని అన్నారు. ఈ విషయంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శించారు. రాష్ట్రప్రభుత్వం రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేసిన వాటిపై వడ్డీని చెల్లించకపోవటంతో బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వటం లేదని చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు జంగా రాఘవరెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.