వరంగల్

‘పురాతన ఆలయాల అభివృద్ధికి కృషి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్‌ఘన్‌పూర్, జూన్ 23: రాష్ట్రంలోని పురాతన ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.
శుక్రవారం చిల్పూర్ మండలంలోని బుగులు వెంకటేశ్వరస్వామి ఆలయ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్‌గా మూల నాగరాజుతో పాటు ధర్మకర్తలు మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
వెలుగులో ఉన్న ఆలయాలే కాకుండా పురాతన ఆలయాలను సహితం పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొ న్నారు. అందులో భాగంగానే ఆలయాల నిర్మాణాలకు రాష్టవ్య్రాప్తంగా ప్రత్యేక కమిటీ వేయడం జరుగుతుందన్నారు.
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను దుర్వినియోగం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డా. రాజయ్య అధ్యక్షత వహించగా అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం, కలెక్టర్ శ్రీదేవసేన, వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, ఎంపిపి జగన్మోహన్‌రెడ్డి, జడ్పిటిసి భూక్యా స్వామినాయక్, సర్పంచ్‌లు విజయాదశరధం, తోట రాజయ్య, ఎంపిటిసిలు నగరబోయిన మణెమ్మ, మాచర్ల మంజుల, నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.