గుంటూరు

జనావాసంలోకి వింత జంతువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, జూన్ 23: మండల కేంద్రమైన అచ్చంపేటలో శుక్రవారం రాత్రి జనావాసంలోకి ఓ వింత జంతువు వచ్చి అందరినీ ఆశ్చర్యచకితులను చేయడంతో పాటు భయాందోళనలకు గురి చేసింది. స్థానిక నీలకంఠేశ్వర స్వామి దేవాలయం వీధిలో పొలుసులు, నాలుగు కాళ్లు, తోక మొత్తంగా మొసలి పోలిన జంతువు ఆకారంలో కన్పించింది. దీంతో వీధిలో ఉన్న వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అదేమైనా అపకారం చేసే జంతువేమోనని కొందరు ఆ జంతువును హతమార్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే అక్కడ మరికొందరు అచ్చంపేట పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఎస్‌ఐ ఎస్‌కె వౌలా షరీఫ్ సంఘటన స్థలానికి చేరుకుని వీధిలో వారికి ధైర్యం చెప్పారు. జంతువు ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో దాన్ని అలుగుగా గుర్తించారు. దాని వల్ల ఎలాంటి హాని ఉండదని చెప్పడంతో పాటు గోతంలోకి వేసి భద్రపరచి తమకు అప్పగించాలని సూచించారు. ఎస్‌ఐ వౌలా షరీఫ్ జంతువును సురక్షితంగా గోతంలో వేసి ఫారెస్టు అధికారులకు అప్పజెప్పడంతో పాటు అడవిలోకి వదిలేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.