గుంటూరు

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 23: జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు రవాణా, పోలీసు, రోడ్డు భవనాల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలు, ప్రమాదాలు జరిగితే ప్రాణనష్ట నివారణకు తీసుకోవాల్సిన వైద్య సేవలపై కలెక్టర్ రవాణాశాఖ, పోలీసు, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్, వైద్యారోగ్యశాఖ, పురపాలక శాఖ జాతీయ రహదారుల విభాగం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశిధర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతినెలా 3వ మంగళవారం సమావేశమై సమీక్షించడం జరుగుతుందని, ఈ సమావేశానికి వారం రోజుల ముందు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, గత సమావేశంలో అజెండా అంశాల వారీగా తీసుకున్న చర్యలపై సంబంధిత శాఖల అధికారులు నివేదికలు అందించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను పది రోజుల్లోపు అందజేయాలన్నారు. ప్రభుత్వం రోడ్డు సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత నిస్తుందని, జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిశాఖ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి సమర్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రవాణా, పోలీసు శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. నర్సరావుపేటలో ఒక ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా కలెక్టర్ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈసమావేశంలో డిటిసి రాజారత్నం, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.