ఖమ్మం

రాష్ట్ర సంపద కార్పొరేట్ సంస్థలకు ధారదత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూన్ 23: తెలంగాణ రాష్ట్రంలోని సహజ సంపదను ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కొత్తగూడెం పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్‌ను ముట్టడించిన అనంతరం నిర్వహించిన సభలో ఆయన మట్లాడుతూ పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ గిరిజనుల భూములను ప్రభుత్వం హరితహారం పేరుతో లాక్కుంటోందని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ప్రభ్తుత్వ పతనం ఖాయమని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వంపై ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అర్హత కల్గిన పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దళితులు, గిరిజనులకు మూడెకరాల సాగుభూమిని పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన కెసిఆర్ ప్రభుత్వం అములలో విఫలమవుతుందన్నారు. గత కొనే్నళ్లుగా పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనుల భూములను లాక్కుంటే సహించేది లేదన్నారు. త్రిపుర రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యుడు జతిన్ చౌదరి మాట్లాడుతూ అటవీ హక్కుల యాజమాన్య చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. హరితహారం పేరుతో పోడు భూములను లాక్కుంటున్న ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. చట్ట ఉల్లంఘనపై పార్లమెంటులో చర్చిస్తానని తెలిపారు. భద్రాచలం శాసన సభ్యుడు సున్నం రాజయ్య మాట్లాడుతూ ఏజన్సీ ప్రాంతాల్లో ఫారెస్ట్, పోలీసు అధికారులు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ప్రాణాలకు తెగించి పోడు వ్యవసాయం కోసం ఉద్యమిస్తామన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కాసాని అయిలయ్య మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్హత కల్గిన పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందు కోసం మరిన్ని ఉధ్యమాలను నిర్మిస్తామని తెలిపారు. పోడు భూములను కాపాడుకునేందుకు జైలుకు వెళ్లేందుకైనా వెనుకాడమని వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర, జిల్లా నాయకులు పోతినేని సుదర్శన్, మచ్చా వెంకటేశ్వర్లు, ఎజె రమేష్, అన్నవరపు కనకయ్య, యలమంచిలి రవి, అన్నవరపు సత్యనారాయణ, పుల్లయ్య, జ్యోతి, యాకయ్య, బ్రహ్మాచారి, నాగేశ్వరరావు, ధర్మా, కృష్ణ, రేణుక, భూక్యా రమేష్, ఎండి జలాల్‌లతోపాటు జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోడు రైతులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.