శ్రీకాకుళం

పుస్తకాల్లేవ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, జూన్ 23: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ సూల్క్ మాదిరీగా తీర్దిదిద్దేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి స్థానిక సర్పంచ్ వరకు ఉపన్యాసాలు దంచుతున్న విషయం తెలిసిందే. అయితే విద్యా సంవత్సరం ప్రారంభమై పక్షం దినాలు కావస్తున్నా మండలి కేంద్రాలకు ఇంగ్లీష్ మీడియం పాఠ్యపుస్తకాలు చేరలేదు. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులను పాఠ్యపుస్తకాలు లేమి వెంటాడటంతో వారంతా బుక్‌షాపుల వద్ద కొనుక్కునేందుకు బారులు తీరుతున్నారు. నగరాలు, పట్టణాలలో ఏ పుస్తకాలు షాప్ వద్ద చూసినా విద్యార్థులు, వారి తల్లిదండ్రులే దర్శనమిస్తున్నారు. స్టేట్‌సిలబస్ అకాడమీ పుస్తకాలు సరఫరా చేయడంలో బాబు సర్కార్ చేతిలెత్తేయడంతో ఈ పరిస్థితి దాపరించిందని బహిరంగంగా తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. పుస్తక వ్యాపారులకు లభించే పాఠ్యపుస్తకాలు ప్రభుత్వానికి లభ్యం కాలేదా అని అనేకమంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులను నిలదీస్తున్నారు. విద్యార్థులు అవసరాలను ఆసరాగా తీసుకొని బుక్‌షాప్ నిర్వాహకులు ధరలు పెంచడమే కాకుండా కృత్రిమ కొరతను కూడా సృష్టిస్తున్నారు. ఇటు ఇచ్ఛాపురం నుంచి అటు పైడి భీమవరం వరకు అన్నిమండలాల్లో ఇదే పరిస్థితి కొనసాగడంతో జిల్లా కేంద్రంలోని అన్ని పుస్తక దుకాణాల వద్ద మరింత రద్దీ కొనసాగుతుంది. ఆరవ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం నేటికీ సరఫరా చేయలేదరు. సర్కారు బడుల్లో చదివిన విద్యార్థులను పుస్తకాల కొరత వెంటాడటంతో ఆ తల్లిదండ్రులు పాఠ్యపుస్తకాల కోసం పట్టణాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించిన తల్లిదండ్రులకు ధరల భారం లేకపోయినా పాఠ్యపుస్తకాల కొరత అవస్థలు పాలు చేస్తుంది. పుస్తక దుకాణ యజమానులు కూడా తరగతి వారీగా
అన్ని పుస్తకాలు కొనాలని నిబంధన పెట్టడం , విడి పుస్తకాలు అమ్మకపోవడం ఆయా తల్లిదండ్రులు జేబులకు చిల్లులు పడేలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాల్లో పాఠశాలలు పునఃప్రారంభానికే ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించి ఈ విద్యా సంవత్సరంలో మాత్రం వెనకంజలో ఉండటం విద్యార్థులకు తలనొప్పిగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం సర్కారు బడులకు ఇంగ్లీష్ మీడియం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి విద్యా ప్రమాణాల మెరుగుకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.