శ్రీకాకుళం

వైకాపాలో ధనవంతులకే పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందస, జూన్ 23: వైకాపాలో ధనవంతులకే ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైకాపా రాష్ట్ర సమన్వయకర్త జుత్తు జగన్నాయకులు అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించారని, అయితే వైకాపా అధ్యక్షుడు జగన్ తాను పేదవాడినని, టికెట్ నిరాకరించడంతో 2014 ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయిందని పేర్కొన్నారు. విశాఖలో అనారోగ్యంతో కిడ్నీమార్పిడి కోసం చికిత్స పొందుతున్న సమయంలో పలాస సమన్వయకర్తగా సీదిరి అప్పలరాజు నియమించడంపై తనకు సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తన 58వ జన్మదిన వేడుకలు సందర్భంగా వాసుదేవ ఆలయంలో కుటుంబీకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన జరిపారు. అనంతరం హరిపురంలోని పెద్దవీధిలో వైకాపా కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్‌ను కట్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుదిశ్వాస వరకు ప్రజాసేవ చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని , 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు. 13 ఏళ్లుగా తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు, అభివృద్ధి, సంక్షేమం చేసి పలాస నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కార్యకర్తల అండదండలతో చెరగని ముద్ర వేసానన్నారు. తనకు పునర్జన్మను ప్రసాదించిన భగవంతుడుకు, కార్యకర్తలకు రుణపడి ఉంటానన్నారు. వైకాపా సమన్వయకర్త సీదిరి అప్పలరాజు, పలాస మున్సిపల్ ఛైర్మన్ కోత పూర్ణచంద్రరావు, దువ్వాడ బ్రదర్స్, ఉదయ్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు వై.కృష్ణమోహన్, జి.చంద్రశేఖర్, ఎం. ఆనందరావు, బాడ జగన్నాయకులు, గున్నయ్య, బి.్ఢల్లీరావు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.