Others

గుజరాత్‌ను ఆదర్శంగా తీసుకోలేమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ దేశం అభివృద్ధి అయినా ఆ దేశ ప్రజల ఆరోగ్యం, అక్షరాస్యతలపై ఆధారపడి ఉంటుంది. దేశాభివృద్ధిలో విద్య, వైద్య రంగాలు అత్యత కీలక పాత్ర వహిస్తాయి. ఈ రెండు రంగాలలో ప్రభుత్వ పెత్తనం ఎంతగా ఉంటే విద్య, వైద్య సౌకర్యాలు ప్రజలకు అంతగా అందుబాటులో ఉంటాయి. విద్య, వైద్య రంగాలలో పెట్టే పెట్టుబడుల వల్ల ప్రత్యక్షంగా ఎటువంటి ఆదాయం లభించదు. పరోక్షంగా లభించే ఆదాయం వేలకోట్ల రూపాయలలో వుం టుంది. దురదృష్టవశాత్తు పాలకపక్షాలు ఈ రెండు రంగాలనుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో విద్య, వె ద్య రంగాలలో ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల ప్రాబల్యం పెరిగింది.
దునే్నవాడిదే భూమి అన్నమాదిరిగా ‘డబ్బున్నవారికే విద్య, వైద్య సౌకర్యాలు’ అన్న చందాన పరిస్థితులు మారిపోయా యి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుండగా ప్రైవేటు విద్యా సంస్థల పరిస్థితి ‘మూడు స్కూల్స్ ఆరు బ్రాంచీలు’ అన్న చందాన వెలుగొందుతున్నది. ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజుల వసూళ్లపై నియంత్రణ లేకపోవడంతో కార్పొరేట్ విద్యాసంస్థలు వివిధ రకాల పేర్లతో తల్లిదండ్రులనుంచి వేలాది రూపాయలు ఫీజులరూపంలో వసూలు చేస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమంలో చదవకపోతే ఎందుకూ పనికిరాడు అనే భావనను ప్రజలలో కల్పించడంలో కార్పొరేట్ విద్యాసంస్థలు సఫలీకృతం అయ్యాయి.
ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రిస్తామమని చెబుతున్న పాలకపక్షాల ప్రకటనలు గోడమీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. ఇదే పరిస్థితి దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉంది.ఈ పరిస్థ్థితులను చక్కదిద్ది అన్ని వర్గాల వారికి మంచి విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి గుజరాత్ ప్రభుత్వం నడుం బిగించింది. ప్రైవేటు లేదా కార్పొరేట్ విద్యా సంస్థలలో ప్రాథమిక విద్యకు (ఒకటినుంచి ఐదవ తరగతి వరకు)సాలీనా ఒక్కొక్కవిద్యార్థినుంచి 15 వేల రూపాయలకు మించి ఫీజులు వసూలు చేయకూడదు. సెకండరీ విద్య (ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు) సాలీనా ఒక్కొక్క విద్యార్థినుంచి 25వేలు, హయ్యర్ సెకండరీ విద్య ((ఇంటర్మీడియెట్)కు సాలీన ఒక్కొక్క విద్యార్థినుంచి 27 వేలు రూపాయలు మాత్రమే ఫీజుగా వసూలు చేయాలి. అంతకన్నా ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తే ఐదునుంచి పది లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. సదరు పాఠశాలను మూసివేయిస్తారు. గత రెండు సంవత్సరాలుగా గుజరాత్‌లో ఈ చట్టం అమలుచేస్తున్నారు. దీనివలన గుజరాత్‌లో ధనిక, పేద అనే తేడా లేకుండా అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది. ఇదే విధానాన్ని తమ రాష్ట్రాలలో కూడా అమలు చేయడానికి బిజెపి పాలిత రాష్ట్రాలు సన్నాహాలు చే స్తున్నాయి. ఇదే విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తే కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీనుంచి ప్రజలను కాపాడవచ్చు. అన్ని విషయాల్లో గుజరాత్‌ను రోల్‌మోడల్‌గా తీసుకునే తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు విద్యకు సంబంధించి గుజరాత్‌ను అనుసరిస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది.

-పి.మస్తాన్‌రావు