అనంతపురం

నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలికిరి, జూన్ 23 : నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితోనే సాధ్యమని రాష్ట్ర ఐటిశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం కలికిరి మండలం మహాల్‌లో అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవానికి హాజరైన రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ర్యాలీ నిర్వహించి స్థానికంగా ఉన్న దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 60వేలు పంట సంజీవని కుంటల నిర్మాణం పూర్తయిన సందర్భంగా కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే సాధ్యమని, రాష్ట్రం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోను రంజాన్ తోఫా పంపిణీ చేయలేదని, ఆ ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. వచ్చే 2019లోగా 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు, ఎల్‌ఇడి లైట్లు, మంచినీటి సమస్య లేకుండా ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1100 ద్వారా ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. రూ.2.30 లక్షల అంచనా వ్యయంతో ఉర్దూ ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన నిర్మాణం, రూ.1.91 లక్షల అంచునా వ్యయంతో చెత్త నుంచి సంపద తయారీ కేంద్ర నిర్మాణం, రూ. 28.80 లక్షల వ్యయంతో నీరు-చెట్టు పథకంలో 276 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తాను ఇంత చిన్న వయస్సులోనే మంత్రి అవుతానని జీవితంలో ఎప్పుడూ అనుకోలేదన్నానరు. పల్లెలకు సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లే అన్నారు. 67 సంవత్సరాల వయస్సులో 20 సంవత్సరాల యువకుడిలా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత రూ.16 వేల కోట్లు లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి, డ్వాక్రా మహిళలకు, రైతు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే అన్నారు. రాబోయే రెండేళ్లలో చిత్తూరు జిల్లాలో ప్రతి గ్రామానికి సిసి రోడ్లు వేస్తామన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, జడ్‌పి చైర్మన్ గీర్వాణి చంద్రప్రకాష్, జిల్లా టిడిపి అధ్యక్షుడు నాని, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు, సబ్‌కలెక్టర్ వెట్రిసెల్వి, పీలేరు నియోజకవర్గం టిడిపి ఇన్‌చార్జ్ ఇక్బాల్‌అహ్మద్, కలకడ ఎంపిపి శ్యామలకాంతరావు, టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.