అనంతపురం

యానాది కాలనీ వాసుల తరలింపును అడ్డుకున్న సిపిఎం, కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 23: స్థానిక లీలామహాల్ సర్కిల్‌కు సమీపంలోని యానాదికాలనీలో ఉన్న నివాసితులను నూతనంగా నిర్మించిన గృహాల్లోకి తరలింపు శుక్రవారం ఉద్రిక్తంగా మారింది. 5.34 ఎకరాల విస్తీర్ణంలో 343 గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నారు. ఇళ్లు పాతపడి వర్షాల సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. సి ఎం గతంలో ఆప్రాంతాన్ని పరిశీలించి వారికి మంచి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో బహుళ అంతస్థుల నిర్మాణానికి నగరపాలక సంస్థ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ సముదాయంలో వాణిజ్యపరంగా కూడా ఉపయోగించుకునేలా అధికారులు రూపకల్పన చేశారు. తమకు వ్యక్తిగత గృహాలు నిర్మించి ఇవ్వాలని యానాదులు డిమాండ్ చేశారు. ఈక్రమంలో యానాదికాలనీ సమీపంలోని 40 నూతన ఇళ్ళను నిర్మించారు. అక్కడున్న యానాదులను నూతన గృహాల్లోకి తరలించి దశలవారీగా తక్కినవారిని ఇతర ప్రాంతాలకు తరలించే విధంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం నూతనంగా నిర్మించిన ఇళ్ళను ఎమ్మెల్యే సుగుణమ్మ, టిడిపి నేతలు డాక్టర్ సంజయ్, దంపూరి భాస్కర్, డాక్టర్ సుధారాణి, పుష్పావతి యాదవ్, మందలపు మోహన్‌రావు, వై.ప్రవీణ్ తదితరులు అక్కడకు చేరుకుని ప్రారంభించి, తిరుగుప్రయాణం అయ్యారు. ఇది గమనించిన కాలనీవాసులు అగ్గిపెట్టెల్లా ఉన్న ఆ ఇళ్లను ప్రారంభించినా తాము వెళ్లమని యానాదికాలనీ వాసులు భీష్మించారు. వారికి సిపి ఎం, కాంగ్రెస్ పార్టీలు మద్దతు పలికి, ఎమ్మెల్యే సుగుణమ్మ కారు ముందుకు వెళ్లకుండా ఆందోళనాకారులు రోడ్డుపై అడ్డంగా పడుకుని వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే వెంట ఉన్న టిడిపి నేతలు వామపక్ష పార్టీనేతలతో వాగ్వివాదానికి దిగారు. దీంతోటిడిపి, వామపక్ష నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.అయితే ఆందోళన కారులు మాత్రం వెనకడుగు వేయలేదు. అదే సమయంలో ఎమ్మెల్యే వెంట ఉన్న కొంతమంది టిడిపి నేతలు మహిళలపట్ల అభ్యంతరకరంగా మాట్లాడారని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు డాక్టర్ సంజయ్‌తో ఆందోళన కారులు తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దిగారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి యానాదుల కుంటుంబాలతో వ్యాపారం చేయడానికి ప్రయత్నించవద్దంటూ విమర్శలు చేశారు. దీంతో సంజయ్ ఆమె వెనుక నుంచి తల జుట్టును పట్టుకుని లాగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో శ్రీదేవి తాను ఒక మహిళనే ఆలోచన లేకుండా తనపై చేయి ఎలావేస్తారంటూ ఒక మహిళ ఎమ్మెల్యే సమక్షంలోనే ఇలా జరగడం ఏమిటని ఆందోళనాకారులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో డాక్టర్ సంజయ్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు. అయితే కేసును నమోదు చేయలేదు. ఇదిలావుండగా అక్కడ నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో తోపులాట జరిగిందేకాని సంజయ్ శ్రీదేవి తల జుట్టు పటుకోలేదని టిడిపి నేతలు అంటున్నారు. అంతేకాకుండా ఈసంఘటనపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టడం విరమించుకోవాలని టిడిపి నేతలు కాంగ్రెస్ నాయకులను కోరుతున్నట్లు సమాచారం. అయితే శ్రీదేవి మాత్రం అంతమందిలో తనను అవమానపరచి ఇప్పుడు పొరబాటు జరిగిందని చెప్పడం ఏమిటని ఆమె వామపక్ష నేతలతో అంటున్నట్లు సమాచారం. పొరపాటని బావించి ఉంటే అక్కడే క్షమాపణలు చెప్పి ఉండాలి కదా అని, తాను కేసును ఉపసంహరించుకోనని శ్రీదేవి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై జిల్లా కాంగ్రెస్ నాయకులు టిడిపి నేతల చర్యలకు నిరసన వ్యక్తం చేస్తారా లేక రాజీపడతారా అన్నది వేచి చూడాల్సిందే. ఇంతకూ యానాదికాలనీ ఉంటున్న ప్రదేశం సుమారు రూ.200 కోట్లకు పైగా విలువ చేస్తుండటంతో నగరపాలక సంస్థ అధికారులు ఇటు గిరిజనులకు, అటు వ్యాపార పరంగాను వినియోగించుకోవాలని యోచిస్తున్నారు. బహుళ అంతస్థుల నిర్మాణం జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని గిరిజనులతోపాటు అక్కడ నివాసం ఉంటున్న మరికొంత మంది కూడా అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా సిపి ఎం నగర కార్యదర్శి టి.సుబ్రమణ్యం, సి ఐటియు నగర కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ఏపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరువాధ్యక్షుడు వాడ గంగరాజు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఆర్.లక్ష్మి మాట్లాడుతూ కోట్లాది రూపాయల విలువచేసే భూములను యానాదులకు దక్కుకుండా చేయడం సరికాదన్నారు. వారికి అపార్ట్‌మెంట్‌లుగా కాకుండా వారిపేరు మీద పట్టాలిచ్చి, ఇళ్ళు నిర్మించుకోవడానికి ప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా బహుళ అంతస్థుల భవనం నిర్మించి అందులో ఒక ఇళ్ళు కేటాయించడం వల్ల యానాదాలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయాన్ని తిరుపతి ఎమ్మెల్యేకి శాంతియుతంగా చెప్పడానికి తాము ప్రయత్నిస్తే టిడిపి నాయకులు దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. మహిళలపై దౌర్జన్యం చేసిన నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో నాగభూషణమ్మ, సుజాత, శ్రీను, రాధా, బుజ్జి, పళణి, కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.