అనంతపురం

త్వరలో టిటిడి పాలక మండలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 23:టిటిడి పాలక మండలి చైర్మన్ నియామకంపై త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం వెలువడుతుందని ఏపి హోం మినిస్టర్ చినరాజప్ప అన్నారు. శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులతో కలసి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. సి ఎం ఆదేశాల మేరకు టిటిడి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను మంత్రి అభినందించారు. విద్య, వైద్యంలోనే కాకుండా తిరుపతి, తిరుమల సుందరీకరణ కోసం మొక్కలు పెంచే కార్యక్రమం కూడా బాగా చేస్తున్నారని ప్రశంసించారు. భక్తులకు అన్నప్రసాదం అందించే దిశగా తిరుమలలో మరికొన్ని చోట్ల టిటిడి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. తిరుపతిలోని టిటిడి విద్యా సంస్థల్లోని విద్యార్థులకు భోజన వసతి కల్పించడాన్ని కూడా ఆయన మంత్రి చినరాజప్ప అభినందించారు.