తూర్పుగోదావరి

కన్నవారే కాలయములయ్యారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, జూన్ 23: ఆర్థిక ఇబ్బందులో, కుటుంబ కలహాలో తెలియదుకానీ నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లిదండ్రులే అభం శుభం తెలియని చిన్నారులు శిరీష (9), అనూష (7) పాలిట కాలయములయ్యారు. స్వయంగా తమ చేతులతో కూల్‌డ్రింకులో విషం కలిపి, తాగించి, హత్యచేశారు. ఒక లాడ్జి గదిలో వారిని విగతజీవులుగా వదిలేసి, తమదారిన తాము వెళ్లిపోయారు. తామూ ఆత్మహత్య చేసుకోబోతున్నామని బంధువులకు ఫోన్‌లో సమాచారమిచ్చి, అదృశ్యమయ్యారు. ముక్కుపచ్చలారని ఇద్దరు బాలికలు నోటివెంట నురగలు కక్కుకుని లాడ్జి గదిలోని మంచంపై విగతజీవులై పడివున్నారు. సామర్లకోటలోని ఒక లాడ్జిలో శుక్రవారం మధ్యాహ్నం వెలుగుచూసిన ఈ ఘటన అందరినీ కలచివేసింది.
విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలోని బెల్గాం ప్రాంతానికి చెందిన కోడూరి సత్యనారాయణ, గౌరీశ్వరమ్మ దంపతులు ఇద్దరు పిల్లలతో విశాఖపట్నంలోని పెదవాల్తేరులో నివాసం ఉంటున్నారు. బంధువుల వద్ద అప్పులు చేసి, సత్యనారాయణ పెదవాల్తేరులో సెలూన్ ఏర్పాటుచేసుకున్నాడు. కాగా గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుపతి తీర్థయాత్ర నుండి వచ్చామని సామర్లకోట రైల్వే ఓవర్‌బ్రిడ్జిని ఆనుకుని ఉన్న ఎస్‌ఆర్‌సి లాడ్జీలో సత్యనారాయణ దంపతులు రూం తీసుకున్నారు. గుమాస్తా వారి నుండి ఆధార్ కార్డు వివరాలు నమోదు చేసుకుని రూం నెంబర్. 106 ఇచ్చాడు. సమీపంలోని ఆలయాలు దర్శించుకుంటామని చెప్పి సాయంత్రం 7 గంటలకు గదికి తాళం పెట్టి భార్యాభర్తలు బయటకు వెళ్లిపోయారు. అప్పటికే గదిలో ఇద్దరు చిన్నారులకు కూల్ డ్రింక్‌లో పురుగుల మందును కలిపి తాగించినట్టు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం లాడ్జీలో డ్యూటీ మారే సమయంలో రూం కేటాయించిన గుమాస్తాకు అనుమానం వచ్చి గదిలోకి కిటికి పైనుండి చూశారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు బోర్లా పడుకుని నిద్రపోతున్నట్లు కన్పించింది. దాంతో ఇద్దరు పిల్లలను గదిలో పెట్టి తాళంవేసి వెళ్లడం ఏమిటని అనుమానం వచ్చి తాళంను పగులగొట్టి చూడగా, అప్పటికే నోటి వెంబటి నురగలు కక్కుకుని అక్కాచెల్లెళ్లు శిరీషా, అనూషా మృతిచెందారని గుర్తించారు.గురువారం రాత్రే వీరిద్దరూ చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సత్యనారాయణ, గౌరీశ్వరమ్మలు విశాఖపట్నంలో ఉంటున్న తోడల్లుడు సతీష్‌కు ఫోన్‌చేసి ఈ ఘతుకాన్ని వివరించారు. అందరూ ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నామని, పిల్లలు ఇద్దరు చనిపోయారని, తమకు వాంతులు అవ్వడంతో చావు నుండి తప్పించుకుని అనారోగ్యంగా ఉన్నామని, తాము చనిపోతామని పిల్లలను చూడాలని తెలిపారు. తాము ఇద్దరు హైదరాబాద్‌లో ఉన్నామని చెప్పారు. దాంతో సతీష్ తదితర బంధువులు శుక్రవారం సాయంత్రం 3 గంటలకు లాడ్జివద్దకు చేరుకున్నారు. వారి ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
మృతదేహాల వద్ద థమ్సప్ పావు లీటర్ కూల్‌డ్రింకు బాటిల్, వాటర్ బాటిల్, వారి చిన్నచిన్న హ్యాండ్ బ్యాగ్‌లు, భార్యాభర్తల బట్టలతో కూడిన బ్యాగ్, రేషన్‌కార్డు, ఒక సెల్‌ఫోన్‌ను బంధువుల సమక్షంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పిల్లలకు పురుగులమందు తాగించిన దంపతులు వారు తాగారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా తాగి వుంటే 16 గంటల అనంతరం కూడా ఫోన్లు చేసి ఎలా మాట్లాడుతున్నారు, చేసిన నేరం నుండి తప్పించుకోవడానికి కథలు అల్లుతున్నారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. పెద్దాపురం సిఐ ఎస్ ప్రసన్న వీరయ్యగౌడ్, సామర్లకోట ఎస్సై ఎల్ శ్రీనువాసు నాయక్‌లు మృతుల బంధువుల నుండి, లాడ్జి నిర్వాహకుల నుండి సమాచారం సేకరించారు.
పరారీలో ఉన్న తండ్రి సత్యనారాయణతో ఫోన్‌లో పెద్దాపురం సిఐ ప్రసన్న వీరయ్యగౌడ్ కూడా మాట్లాడారు. ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, తక్షణమే రావాలని, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని వారికి ఫోన్‌లో నచ్చచెప్పారు.
తల్లిదండ్రులపై హత్యా నేరం కేసు నమోదు: సిఐ వీరయ్యగౌడ్
కాగా ఈ ఘటనలో అక్కాచెల్లెళ్ల మరణానికి కారణమైన తల్లిదండ్రులు కోడూరి సత్యనారాయణ, గౌరీశ్వరమ్మలపై సెక్షన్ 302 కింద హత్యా నేరం కేసు నమోదు చేసినట్టు పెద్దాపురం సిఐ ప్రసన్న వీరయ్యగౌడ్ విలేఖరులకు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిఐ ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనువాసు నాయక్ దర్యాప్తు చేస్తున్నారు.