తూర్పుగోదావరి

అణిచివేతకు మూల్యం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, జూన్ 23: ఎన్నికల హామీ అమలు కోసం కాపు జాతి ఉద్యమం చేస్తుంటే అణిచివేసే చర్యలకు పాల్పడటం ముఖ్యమంత్రికి తగదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. అణిచివేత చర్యలకు తగుమూల్యం తప్పదని హెచ్చరించారు. శుక్రవారం కిర్లంపూడిలో పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ముద్రగడను కలిసిన సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ముద్రగడ మాట్లాడారు. అధికారం చేపట్టి 18 నెలలు గడిచిన తరువాత ఎన్నికల్లో జాతికి ఇచ్చిన హామీని అమలుచేయాలని తాను ఎన్నో లేఖలు రాసిన అనంతరం ముఖ్యమంత్రి నుండి స్పందన రాక రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. ఈ క్రమంలో ఆరు నెలల్లోగా జాతికి రిజర్వేషన్ ఇస్తానని ఒకసారి, మంజునాథ కమిషన్ పల్స్ సర్వే అనంతరం రిజర్వేషన్ ఇస్తానని మరోసారి చెప్పి ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని ముద్రగడ విమర్శించారు. పల్స్ సర్వే, మంజునాథ కమిషన్ పర్యటన ముగిసి నెలలు గడుస్తున్నా చంద్రబాబులో చలనం లేదన్నారు. జాతికి ఇచ్చిన హామీని గుర్తుచేయడం కోసమే తాను జూలై 26 నుండి చలో అమరావతి పాదయాత్రను ప్రారంభించబోతున్నట్టు ఆయన చెప్పారు. తమిళనాడులో అధికారంలో ఉన్న కరుణానిధి అప్పటి ప్రతిపక్ష నాయకురాలు జయలలితను వేధించి, పోలీసులతో కొట్టించి జైలులో పెట్టించారన్నారు. అధికారం కోల్పోయాక కరుణానిథికి పట్టిన గతి చంద్రబాబుకు రాబోయే రోజుల్లో పడుతుందని ముద్రగడ హెచ్చరించారు. ఉద్యమం చేపట్టిన వెంటనే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున మద్దతు పలికారని, ఆయనను తమ జాతి ఎప్పుడూ మరిచిపోదన్నారు. కాంగ్రెస్ పార్టీ తరువాతే మిగతా పార్టీలన్నీ తమ ఉద్యమానికి మద్దతు పలికాయన్నారు. జూలై 26 నాటికి తాను ఉద్యమాన్ని ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తవుతుందని, ఇప్పటికే తాను చేయబోయే పాదయాత్ర రూట్ మ్యాప్ తయారయ్యిందని, పాదయాత్ర సాగే గ్రామాల వివరాలను త్వరలో ముఖ్యమంత్రికి పంపిస్తామన్నారు. జాతి భవిష్యత్తు తరాల కోసం తాను చేయబోయే పాదయాత్రకు ప్రభుత్వం ఎటువంటి అద్దంకులు సృష్టించినా రాబోయే రోజుల్లో దాని ఫలితం అనుభవించాల్సి వస్తుందని ముద్రగడ హెచ్చరించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర కొనసాగుతుందని ఈ సందర్భంగా ముద్రగడ అన్నారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో పాటు కాపు జెఎసి నాయకులు ఆకుల రామకృష్ణ, వైసి యేసుదాసు, కె తాతాజీ, నల్లా విష్ణు, పలువురు కాపు నాయకులు, బిసి సంఘాల నాయకులు పాల్గొన్నారు.