కర్నూల్

వెనక్కు రాకుంటే వేటే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూన్ 23: ఎలాంటి పదవులు లేని మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి వెంట వైకాపా తీర్థం పుచ్చుకున్న కౌన్సిలర్లు రెండు రోజుల్లో తిరిగి టిడిపి గూటికి చేరకపోతే వారిపై వేటు వేయక తప్పదని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శుక్రవారం నంద్యాల టిడిపి నాయకులు ఎవి సుబ్బారెడ్డి స్వగృహంలో నిర్వహించిన నంద్యాల అసెంబ్లీ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సోమిశెట్టి మా ట్లాడుతూ టిడిపి సభ్యులుగా ఉంటూ, ఆ పార్టీ ఇచ్చిన బీఫారంతో ఎన్నికల్లో పోటీ చేసి టిడిపి కౌన్సిలర్లుగా గెలిచి కౌన్సిల్‌లో ప్రమాణస్వీకారం చేసిన టిడిపి కౌన్సిలర్లలో కొంతమంది మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి వెంట వెళ్లి జగన్ సమక్షంలో వైకాపాలో చేరినట్లు పత్రికల ద్వారా తెలిసిందన్నారు. ప్రస్తు తం 15 మంది కౌన్సిలర్లు మాత్రమే శిల్పామోహన్‌రెడ్డి వెంట ఉన్నారని, వారు మరో రెండు రోజుల్లో టిడిపి గూటికి చేరకపోతే వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడంతోపాటు కౌన్సిలర్ పదవి నుండి తొలగించడం జరుగుతుందన్నారు. రెండు రోజుల్లో నంద్యాల అసెంబ్లీ టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డితో కలిసి టిడిపికి సహకరించని వారి పదవులు ఊడిపోతాయన్నారు. నంద్యాల అసెంబ్లీకి జరుగనున్న ఉప ఎన్నికలో సాంప్రదాయం ప్రకారం హఠాన్మరణం చెందిన ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి వారసులైన భూమా బ్రహ్మానందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకొనేందుకు మద్దతు ఇస్తే జిల్లాలోని టిడిపి నాయకులందరు అభినందిస్తామని, లేనిపక్షంలో ఎన్నిక అనివార్యమైతే వైకాపా తరపున నిలిచిన అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడిస్తామన్నారు. జిల్లాకు సంబంధం లేని వ్యక్తి ఎక్కడి నుండో వచ్చి పెత్తనాలు సాగిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఈ సమావేశానికి నంద్యాల పార్లమెంటు పార్టీ పరిశీలకుడుగా హాజరైన గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో బూత్ కమిటీలు, వార్డు కమిటీలను ఏర్పాటు చేసుకోవాలంటే బాధ్యులు విరివిగా సభ్యత్వ నమోదు చేయించాలన్నారు. నంద్యాల టౌన్ కమిటి, నంద్యాల రూరల్ కమిటీ, గోస్పాడు మండల కమిటీ ఏర్పాటుకు ఆయా వార్డులు, గ్రామాలకు సంబంధించిన బాధ్యులు చురుకుగా, సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయించినప్పుడే సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా జన్మభూమి కమిటీ సభ్యులుగా ఖరారు చేయాలంటే ముందుగా వారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని ఉండాలన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి 26 మంది కౌన్సిలర్లు ఉన్నారని, వైకాపా వైపు శిల్పా వెంట 15 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ టికెట్‌పై గెలిచారని, వారు తిరిగి పార్టీలోకి రాకపోతే వేటు వేయక తప్పదని అన్నారు. నంది గ్రూప్ ఎండి శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిని గెలిపించుకోవాలంటే టిడిపి నాయకులందరు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ ఎన్నికలు మరో రెండు నెలల్లో జరుగనున్నాయని, వీటికి సిద్ధం కావాలంటే నంద్యాల పట్టణంలో టిడిపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కావాలని కోరారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రధాన నాయకులు నంద్యాల అసెంబ్లీని విభాగాలుగా విభజించి అభివృద్ధి పనులు చేస్తే వేగంగా జరుగుతాయని ఆ పనులు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎంపి ఎస్పీవైరెడ్డి తరపున బొమ్మలసత్రం, నూనెపల్లె ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తాము ఉత్సాహంగా ఉన్నామన్నారు. టిడిపి నేత ఎవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తనకు పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని, భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపుకోసం శక్తివంచన లేకుండ కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్, ఆళ్లగడ్డ మార్కెట్‌యార్డు చైర్మన్ బివి రామిరెడ్డి, ఎవిఆర్ ప్రసాద్, టిడిపి కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.