కర్నూల్

ప్రపంచ శాంతికి క్రీడలు దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 23:సర్వమానవ సౌభ్రాతృత్వం, ప్రపంచశాంతికి క్రీడలు ఎంతగానో ఉపకరిస్తాయని కలెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. నగరంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఔట్ డోర్ స్టేడియంలో శుక్రవారం ఒలింపిక్ డే రన్ ముగింపు సమావేశం నిర్వహించగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడాస్ఫూర్తి అలవర్చుకుని క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. గెలుపు ఓటమితో సంబంధం లేకుండా క్రీడల్లో భాగస్వాములైతే వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు దేశానికి మంచి పేరు, ప్రఖ్యాతలు తీసుకొచ్చిన వారవుతారన్నారు. ఇటీవల కాలంలో పివి సింధు, శ్రీకాంత్ బ్యాడ్మింటన్ క్రీడలో రాణించి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఏపిఎస్‌ఐడిసి చైర్మన్, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ కెఇ ప్రభాకర్ మాట్లాడుతూ రాబోయే ఒలింపిక్స్ నేషనల్ గేమ్స్‌లో జిల్లా అసోసియేషన్ తరఫున ఒక ఈవెంటును తీసుకెళ్తామన్నారు. ఒలింపిక్ డే రన్‌లో ఉత్సాహంగా పాల్గొ న్న విద్యార్థులు, క్రీడా సంఘాల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 25వ తేదీ రాష్ట్ర రాజధానిలో జరిగే ఒలింపిక్ డే రన్‌లో జిల్లా నుంచి వంద మంది క్రీడాకారులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపి బుట్టా రేణుక మాట్లాడుతూ క్రీడలు ప్రతి మనిషి జీవితంలో ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం గల క్రీడాకారులు అధికస్థాయిలో వున్నారని, ప్రభుత్వం అలాంటి వారిని గుర్తించి ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహిస్తే అత్యుత్తుమంగా రాణిస్తారన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విజయవాడ తర్వాత స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో కర్నూలు జిల్లా ముందుందన్నారు. క్రీడల్లో ఎంతగా రాణించగలిగితే అంతే మొత్తంలో జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుందన్నారు. క్రీడల్లో వున్న ప్రాధాన్యత వేరే ఇతర అంశాలకు లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉండేది ఒక్క క్రీడాకారులకే అన్నారు. పారిశ్రామికవేత్త టిజి భరత్ మాట్లాడుతూ గ్యాస్‌తో ఆకర్షణీయంగా తయారుచేసిన ఒలింపిక్ జ్యోతులను స్పాన్సర్ చేస్తానన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు గౌరుచరితారెడ్డి, మణిగాంధీ, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ పురుషోత్తం, నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి, డిఎస్‌డిఓ మల్లికార్జునుడు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు. అంతకుముందు నగరంలోని ఔట్‌డోర్ స్టేడియం, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, సిల్వర్‌జూబ్లీ కళాశాల, చెన్నమ్మ సర్కిల్, బళ్లారి చౌరస్తా తదితర కూడళ్ల నుంచి 5వేల మంది విద్యార్థులతో ఒలింపిక్ డే రన్ నిర్వహించారు. అనంతరం వివిధ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అంతకుముందు మాంటిస్సోరి, ఇండస్, లక్ష్మీ ఇంగ్లీషు మీడియం పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.