కర్నూల్

రుణాల మంజూరులో బ్యాంకర్ల నిర్లక్ష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలుటౌన్, జూన్ 23:గ్రామీణ పేదరిక నిర్మూలనలో భాగంగా 2017- 18 సంవత్సరానికి గానూ జిల్లాలోని పొదుపు సంఘాల సభ్యులకు రుణా లు మంజూరు చేయాల్సి ఉండగా బ్యాంకర్లు సహకరించడం లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నా యి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 637 కోట్ల రుణాలు అం దించడం లక్ష్యం కాగా నేటి వరకూ కేవలం రూ. 42 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. బ్యాంకు యంత్రాం గం సహకరించకపోవడంతో పొదుపు సంఘాల సభ్యు లు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వెలుగు శాఖ యంత్రాంగం ఈ నెల కాకుంటే మరో 3 నెలల తర్వాత రుణాలు వస్తాయని స్వయం సహాయక సంఘాలకు తెలియజేస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో రుణాలు మంజూరు చేసేలా బ్యాంకు సిబ్బందిపై వత్తిడి తీసుకురావడం లేదన్న విమర్శలు బలంగా వినపడుతున్నాయి. జిల్లాలో ఎస్‌హెచ్‌జి గ్రూపు లు 40వేలు ఉండగా అందులో 28, 968 మంది స్వయం సహాయ సభ్యులకు రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రుణాల ద్వారా పొదుపు సంఘాల సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. వీటి ద్వారా జీవన ఉపాధులు పెరిగి గ్రూపు సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి అయ్యేందుకు వడ్డీ లేని రుణాలు అందించాలని సిఎం చంద్రబాబు వెలుగుశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బ్యాం కు లింకేజీ రుణాలు అందక ఇబ్బందులు పడుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని ఆయా సంఘాల సభ్యులు వాపోతున్నారు. గతంలో రుణాల పంపిణీలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా నేడు 5వ స్థానానికి పడిపోయింది. జిల్లాలో 28వేల గ్రూపులకు రుణాలు అందించాల్సి ఉంది. ఒక్కో గ్రూపులో దాదాపు 12 మంది సభ్యులు ఉంటారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి బ్యాంకు లింకేజీ రుణాల మంజూరుకు ప్రత్యేక చర్యలు తీసుకుని సకాలంలో రుణాలు అందించాలని పొదుపు సంఘాల సభ్యులు కోరుతున్నారు.