ప్రకాశం

అభివృద్ధిలో రాష్ట్రం ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూన్ 23: రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ప్రజల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉందని రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. శుక్రవారం స్థానిక పాత జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగావిచ్చేసిన మంత్రి శిద్దా మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పారదర్శకంగాపనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు, పాలనలో రోల్‌మోడల్‌గా తయారైందన్నారు. అవినీతిరహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం రాష్టమ్రుఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సూచనల చేస్తూ అవినీతిని అదుపు చేసేందుకు కృషిచేస్తున్నారన్నారు. అందుకోసం పరిష్కార వేదికగా 1100నెంబరుతో ప్రజలే ముందు కాల్‌సెంటర్‌ను ప్రారంభించారన్నారు. ఆ సెంటరులో 900మంది సిబ్బంది షిప్ట్‌ల వారీగా నిరంతరం పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామంలోని ప్రజలు ఎవరైన సరే ఈ నూతన విధానాన్ని అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రప్రభుత్వం రైతాంగాన్ని అన్నివిధాల ఆదుకుంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుందన్నారు. జిల్లాలోని రైతులు ముఖ్యమంత్రిని కలిసి శనగల సమస్యలను చెప్పటంతో 2500కోట్ల రూపాయల విలువైన శనగలను మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేసి కోల్డ్‌స్టోరేజిల్లో నిల్వ ఉంచామన్నారు. అదేవిధంగా 275కోట్ల రూపాయల విలువచేసే కందులను కూడా మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేశామన్నారు. ఇంకా రైతుల వద్ద కందులు నిల్వ ఉంటే కొనుగోలు చేస్తామన్నారు. అంతేకాక జడ్‌పిటిసిల అభ్యర్థన మేరకు జిల్లాలో సరిగా వర్షాలు పడక పంటలు నష్టపోయిన రైతుల పంటరుణాలను రీషెడ్యూలు చేసేందుకు కలెక్టర్ ముఖ్యమంత్రికి లేఖరాసి అనుమతి పొందుతారన్నారు. జాతీయరహదారికి 565మార్గంలో భూములు నష్టపోయిన బాధితులకు త్వరలో న్యాయపరిష్కారం చేస్తామన్నారు. జడ్‌పి పరిపాలన భవనం నిర్మాణం కోసం సహకారం అందిస్తామని ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి పంపించాలన్నారు. అంతకుముందు జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు మాట్లాడుతూ అవీనితిరహిత ప్రకాశం జిల్లాగా రూపుదిద్దుకునేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు అవినీతి నిర్మూలించాలని పదేపదే చెబుతున్నారని వారు మాత్రమే చెప్పటంతో సరిపెట్టుకోకుండా అందరూ తమవంతుగా ముందుకు రావాలన్నారు. పారదర్శక పాలన, జవాబుదారీతనం పెంపొందించేదిశగా సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. గ్రామాల్లో మంచినీటి పథకాలు వర్కర్ల కోసం కాదని ప్రజలకు మంచినీరు అందించేందుకేనని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రజాధనాన్ని వృథా చేయకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గ్రామానికి ఎంత నీరు సరఫరా చేస్తున్నామో ఎంతమేర బిల్లులు చెల్లిస్తున్నామో గమనించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో జవాబుదారితనం కోసం ప్రతి ఇంటికి గ్రామానికి ఫ్లోవాటర్ మీటర్‌ను బిగించామని నిర్ణయించామని చెప్పగా సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రస్తుతం ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇగా పనిచేస్తున్న సంజీవరెడ్డి చాలా నిజాయితీగా, నిబద్ధతగా విధులు నిర్వర్తిస్తున్నారని చైర్మన్ అభినందించారు. గ్రామాలకు నీరు అందించే పథకాలకు సంబంధించిన పనులను ప్రతిసారి కేవలం నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు వేసి కైవసం చేసుకుంటున్నారని ఇకపై సభ్యులందరి కోరికపై అనుభవం ప్రతిపాదకగా కాకుండా జిల్లాలో ఎవరైనా సరే ఆ పనులకు టెండర్లు వేసేందుకు బహిరంగ అవకాశం కల్పించాలని సమావేశం తీర్మానించిందన్నారు. జడ్‌పి నిధుల్లో పదిశాతం మెటిరియల్ కాంపోనెంట్ చేసుకునే అవకాశం ఉందన్నారు. సిసి రోడ్ల నిర్మాణాలకు కలెక్టర్ సానుకూలంగా స్పందించాలన్నారు. దేవాలయాలు లాంటి పాఠశాలలు నిర్మించే సమయంలోఅవినీతికి పాల్పడేవారిని ఏమి చేయాలన్నారు. గ్రామాల్లో నిర్మించే సిసిరోడ్ల డిజైన్లల్లో హేతుబద్దత ఉందా అని అధికారులను ప్రశ్నించారు.గ్రామనిర్మాణంలో పాటిస్తున్న నాణ్యతప్రమాణాలపై ప్రశ్నించారు. నైతిక విలువలు లేని సమాజం అభివృద్ధి చెందదన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వి వినయ్‌చంద్ మాట్లాడుతూ జిల్లాపరిషత్ ప్రజాస్వామ్యంలో ఒక కీలకమైన భాగమని, క్షేత్రస్థాయిలో అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే వేదిక అన్నారు. ప్రజల సమస్యలను నాలుగు వినూత్న మార్గాల ద్వారా పరిష్కరిస్తామన్నారు. కౌలురైతులకు రుణ అర్హత కార్డులు ఇచ్చేందుకు కృషిచేస్తున్నామని వారితో పాటు సాగుచేస్తున్న రైతులకు పంటరుణాలను అందించేందుకు ఈనెల 28న బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. అవినీతిరహిత పాలన అందించాలన్నది చాలా మంచి అంశమని ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్, నవనిర్మాణ దీక్ష, కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ల్లో ఈ విషయాల గురించి చెబుతున్నారన్నారు. ఆచరణలో భాగంగా 1100నెంబరును ప్రవేశపెట్టారన్నారు. జడ్‌పిటిసిలు, శాసనసభ్యులు లేవనెత్తిన పలు సమస్యలపై కలెక్టర్ స్పందించారు. ముస్లింలకు రంజాన్ తోఫాను అందించే విధంగా డిఎస్‌ఒకు సూచనలు ఇస్తామన్నారు. కంభం చెరువు సమస్యను పరిష్కరిస్తామన్నారు. కారంచేడు మండలంలో ఆదర్శంగా నిర్వహిస్తున్న అంగన్‌వాడి కేంద్రాన్ని చూసి వారిని అభినందించాలని జడ్‌పిటిసి నాగజ్యోతి కోరటంతో కలెక్టర్ వెంటనే స్పందిస్తూబాగా పనిచేసే ఉద్యోగులు ఆగస్టు 15, జనవరి 26వ తేదీల్లో బహుమతులు అందజేస్తామన్నారు. అవినీతిపై ఫిర్యాదుచేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. బాపట్ల పార్లమెంటు సభ్యుడు శ్రీరాం మాల్యాద్రి మాట్లాడుతూ అవినీతి రహితపాలన అంశాన్ని చర్చకు తెచ్చినందుకు జడ్‌పి చైర్మన్‌ను అభినందించారు. సమాజంలోని వ్యవస్థ కుళ్లిపోయిందని వ్యక్తిగా, మనిషిగా విలువలు దిగజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలి సభ్యురాలు పోతుల సునీత మాట్లాడుతూ త్వరగా వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కొండెపి శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ సమాజంలో కిందస్థాయి నుండి మార్పు వచ్చినప్పుడే అవినీతిరహిత పాలన సాధ్యవౌతుందన్నారు. ఉపాధ్యాయుల ఏకీకృతవిధానం చాలాకాలంగా పెండింగ్‌లో ఉందని ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రి కృషిమేరకు రాష్టప్రతి ఆమోదముద్ర వేయటంతో సమస్య పరిష్కారం అయిందన్నారు. మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ 565రహదారి మార్గంలోని దేవరాజుగట్టు జంక్షన్ భూసేకరణ చేయలేదని, నష్టపరిహారం ఇవ్వలేదని, భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. కొనకనమిట్ల మండలంలో రికార్డులు సరిగా చూడటం లేదని ఆన్‌లైన్ ద్వారాప్రక్షాళన చేయాలన్నారు. సంతనూతలపాడుశాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ అనేకప్రభుత్వ శాఖల్లో పారదర్శకత కొరవడిందన్నారు. ఏశాఖలో ఏ పనులు జరుగుతున్నాయో ప్రజాప్రతినిధులకు తెలియటం లేదన్నారు. ఈసమావేశంలో జిల్లాపరిషత్ ఇన్‌చార్జి సిఇఒ సాయికుమారితోపాటు వివిధ శాఖల అధికారులు, జడ్‌పిటిసిలు, ఎంపిపిలు పాల్గొన్నారు.