ప్రకాశం

సందడిగా ఒలంపిక్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూన్ 23: ఒలంపిక్ రన్ క్రీడాకారులకు పండుగలాంటిదని, ఈ రన్ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు తెలిపారు. శుక్రవారం ఒంగోలులో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలంపిక్ డే సందర్భంగా చేపట్టిన ఒలంపిక్ రన్, ఒలంపిక్ జ్యోతి ప్రదర్శన కార్యక్రమంలో దామచర్లతోపాటు ఎస్‌సి కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకరరావు, ఎస్‌పి త్రివిక్రమవర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఒలంపిక్ రన్ ఎంతో అవసరం అన్నారు. ఒంగోలు నగరంలో మినీస్టేడియం నిర్మాణాన్ని నాలుగు నెలలలోపు పూర్తిచేసి పిల్లల అవసరాలు తీర్చుతామన్నారు. ఒలంపిక్ పోటీలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని, వివిధ రకాల పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాల్సిన అవసరం వుందన్నారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, ఒలంపిక్ అసోసియేషన్ వారు ఏర్పాటుచేసిన ఒలంపిక్ రన్‌లో పాల్గొనందుకు చాలా సంతోషంగావుందన్నారు. ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ 9 దేశాలతో 1894 జూన్ 23న ఒలంపిక్ దినోత్సవం ప్రారంభమైయిందన్నారు. నేషనల్ ఒలంపిక్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే ప్రతి రాష్ట్రంలో కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఇలాంటి రన్‌లతో ఆరోగ్యం, ఎడ్యుకేషన్, పోటీతత్వం, పెరుగుతాయన్నారు. పిటి ఉష నుండి నేటి సింధు వరకు పోటీ మనస్తత్వాన్ని గుర్తించాలని వారి స్ఫూర్తి పొందాలన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని పోటీతత్వంతో ముందుకు తీసుకెళుతున్నారని, కాలంతో సమానంగా అందరూ ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. రాష్ట్రం 2022 సంవత్సరానికి దేశంలో మూడుఅగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కల్గిన రాష్ట్రంగా రూపొందాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. ఎస్‌పి త్రివిక్రమవర్మ మాట్లాడుతూ ఒలంపిక్ రన్‌లో పాల్గొన్న వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. నేటితరం విద్యార్థులకు విద్యతోపాటు ఆటలు, అవసరం అని అన్నారు. రాబోవు ఒలంపిక్ క్రీడలు ఎక్కడ నిర్వహిస్తున్నారని విద్యార్థులను ప్రశ్నించారు. వారు టోక్యో అని వారు సమాధానం తెలిపారు. ఒలంపిక్‌లో గల ఐదు వలయాల గురించి ఆయన వివరించారు. ఒలంపిక్ స్ఫూర్తిని అందరూ పొందాలని సూచించారు. మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం ఒలంపిక్ దినోత్సవాన్ని ప్రకటించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఒలంపిక్ పరుగులో ఒంగోలు శాసనసభ్యులు జనార్దనరావు, ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి యతిరాజ్, సిపిఓ టి వెంకయ్య, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి బి రవి, బాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ కెసిహెచ్ పున్నయ్య చౌదరి, ఒలంపిక్ అసోసియేషన్ కన్వీనర్ కుర్రా భాస్కరరావు, ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు యు పోలయ్య, అడహక్ కమిటీ సభ్యులు జాన్‌బాబు, సురేష్ రెడ్డి, ధనుంజయ, ఎస్ కృష్ణ, స్కూలు గేమ్స్ సెక్రటరీ శీనయ్య, బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ సురేష్, కోచ్‌లు, డిఇఓ విజయభాస్కర్, ఫిజికల్ డైరెక్టర్లు, పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. ఒలంపిక్ రన్ ప్రకాశం భవన్ నుండి అద్దంకి బస్టాండ్ వరకు కొనసాగింది.