పశ్చిమగోదావరి

ఆక్వా రైతులకు మెరుగైన పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, జూన్ 23: ఆక్వా రైతులకు మెరుగైన పథకాలు అందించే కొత్త నిర్ణయంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర క్రీడాశాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం ఆకివీడులో రూ.1.5 కోట్లతో నిర్మించిన ఆక్వా ల్యాబ్‌ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఆక్వా రంగం దినదినాభివృద్ధి చెందుతోందని, ఆధునిక పరిజ్ఞానం ద్వారా ఆక్వా రైతాంగం మరింత దిగుబడులు సాధించాలని హితవు పలికారు. జిల్లాలో 1.7 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు అధికారికంగా ఉండగా, రెండు లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోందని, దీనిని జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేసి రైతులకు రాయితీలు ఇస్తామన్నారు. జిల్లాలో భీమవరం, ఆకివీడు, ఏలూరులో ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటుచేశామని, ఇక్కడ నీటి, మట్టి నాణ్యత మైక్రో బయోలజీ, సీడ్ నాణ్యతను పరిశీలిస్తాయన్నారు. డిసిసిబి చైర్మన్ ముత్యాలరత్నం మాట్లాడుతూ ప్రైవేటు ల్యాబ్‌లు పుట్టగొడుగుల్లా రావడం వల్ల సక్రమమైన సీడు అందక రైతులు మోసపోతున్నారన్నారు. ఈ తరహా ల్యాబ్‌ల ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంలో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. 24 గంటలు విద్యుత్ సరఫరాతో పాటు ఉండి కెవికెలో రూ.8 కోట్లతో రీసెర్చ్ సెంటర్‌ను కూడా ఏర్పాటుచేస్తున్నామన్నారు. మత్య్సశాఖ జెడి అంజలి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని నీలి విప్లవంగా ముందుకు తీసుకువెడుతున్నామన్నారు. ఎఎంసి చైర్మన్ మోటుపల్లి ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రైతులకు కావాల్సిన అన్ని సదుపాయాలను ఎమ్మెల్యే శివరామరాజు కల్పించడం అభినందనీయమన్నారు. సర్పంచ్ గొంట్లా గణపతి, మనె్న లలితాదేవి, పిన్నమరాజు వాణి, దాసరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
భూ దందాలు వైఎస్ హయాంలోనే
భూ దందాలకు తెరలేపింది వైఎస్ హాయాంలోనే తెరలేపిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. ఆ విషయాన్ని మరిచి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ విశాఖ ధర్నాలో సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపై విమర్శలకు దిగడం దారుణమన్నారు. కేవలం భూదందా మొదలైంది వారి హాయాంలోనేనని ఆయన ఎద్దేవా చేశారు.