పశ్చిమగోదావరి

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చంద్రబాబు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, జూన్ 23: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేశారని, దాని ఫలితమే ఏకీకృత ఉపాధ్యాయ సర్వీస్ నిబంధనల దస్తమ్రని రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. ఏకీకృత ఉపాధ్యాయ సర్వీస్ నిబంధనల దస్త్రం రాష్టప్రతి ఆమోదం పొందడం పట్ల కొవ్వూరు నియోజకవర్గ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి మంత్రి జవహర్‌ను ఆయన కార్యాలయంలో ఉపాధ్యాయులు కలిసి ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి జవహర్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సర్వీసుకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావడం హర్షణీయమన్నారు. మున్సిపాల్టీ, ఎయిడెడ్, అన్ని ప్రభుత్వ శాఖల ఉపాధ్యాయులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం వల్ల పదోన్నతలు త్వరితగతిన ఉంటాయన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.