శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సమర్థుల వేటలో చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 23: మరో రెండేళ్లలో జరగబోయే సాధారణ ఎన్నికల్లో టిడిపిలో కొత్త ముఖాలు కనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పార్టీ ముఖ్యుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ దిశగా ఆలోచన చేయాల్సి వస్తోందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించి అక్కడ ఆయన ప్రసంగించిన విధానం కూడా కొత్తవారిని ఆహ్వానించే ఆలోచనలో అధినేత ఉన్నట్లు తెలియచేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయడమంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న విషయమన్నది తెలిసిందే. ఎన్నికల్లో పార్టీకి చెందిన వ్యక్తిగా ఉండటంతో పాటు ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్న వారిని రాజకీయ పార్టీలు వెతికి మరీ అభ్యర్థిగా నిలబెడుతుంటాయి. గెలిచిన తర్వాత వారిలో డబ్బుతో గెలిచామనే ధీమాతో కూడిన స్వరం వినిపిస్తుండటంతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కొత్త విధానానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. కోట్లు ఖర్చుపెట్టుకొని గెలిచామని విర్రవీగుతూ పార్టీని కూడా విస్మరించి మాట్లాడుతుండటం, అవినీతికి ఆస్కారమిస్తుండటంతో ప్రభుత్వానికి ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో చిక్కులు వచ్చాయి. పార్టీ సైతం ఇటువంటి వ్యక్తుల విషయంలో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకోవాల్సిన గత్యంతర పరిస్థితి కూడా ఎదురైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కూడా విఘాతం కలుగుతోంది. జిల్లాలోనూ ఓ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేపై రైల్వే గుత్తేదారులు తీవ్ర అవినీతి ఆరోపణలు చేయడం, ఆరోపణలు నిరాధారమైనవని సదరు ఎమ్మెల్యే వివరణ ఇచ్చుకోవడం జరిగింది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండే మరో నియోజకవర్గంలోనూ సదరు ఎమ్మెల్యే బంధువులు నీరు-చెట్టు పనుల్లో భారీ అవినీతికి పాల్పడుతున్నారంటూ ప్రతిపక్షనేతలు ఆధారాలతో సహా బట్టబయలు చేయడం, తర్వాత ఎమ్మెల్యే అనుచరులు ప్రతి విమర్శలు చేసుకోవడం పూర్తయ్యాయి. కేవలం ఏదో ఒకటి, రెండు నియోజకవర్గాలకే పరిమితం కాకుండా ఇటువంటి పరిస్థితి పలు చోట్ల చోటుచేసుకుంటూ ప్రజల్లో ప్రభుత్వ పనితీరును పలుచన చేస్తోందంటూ ముఖ్యమంత్రికి నిఘా వర్గాల ద్వారా సమాచారం తరచూ అందడంతో చంద్రబాబు రాబోయే ఎన్నికల విషయంలో జిల్లాలో పలుమార్పులు అవసరమనే భావనకు వచ్చినట్లు సమాచారం. సొంత నగదు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిచి పార్టీని ధిక్కరించే దాకా తీసుకు వచ్చేకంటే, సమర్థులైన పార్టీకి చెందిన వ్యక్తుల్ని ఎంపిక చేసి వారి ఖర్చులను పార్టీ ద్వారా చెల్లించి ఎన్నికల్లో నిలబెడితే ఎలా ఉంటుందనే కోణంలో పార్టీ పొలిట్‌బ్యూరో ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఆలోచన అమలు చేస్తే పనిచేసే వారికి అవకాశం కల్పించినట్లవుతుందనే భావన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్నారనే విషయం ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కనీసం ఈ రెండేళ్లయినా అవినీతికి కాస్త దూరంగా ఉండాలని ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు నిర్ణయించుకోవడంతో పాటు తమ అనుచరులు కూడా దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక వ్యక్తి వలన పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనుకుంటే ఎంతటి చర్యలకైనా వెనుకాడనని చంద్రబాబు ఇటీవల పునరుద్ఘాటించడంతో జిల్లా టిడిపి శ్రేణుల్లో వణుకు మొదలైంది.