శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

విజయాల షార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూన్ 23: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ కేంద్రం నుంచి విజయాల ఇస్రోగా పేరు మార్మోగుతోంది. పిఎస్‌ఎల్‌వి-సి 38 రాకెట్ ద్వారా మరోసారి మన శాస్తవ్రేత్తలు చరిత్ర సృష్టించించారు. ఒకే రాకెట్ పది కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన ఘనత మన శాస్తవ్రేత్తలకే దక్కింది. అత్యంత కీలక ఉపగ్రహ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతం చేసింది. శ్రీహరికోట నుంచి శుక్రవారం ఉదయం 9.29 గంటలకు ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి-సి 38 రాకెట్ విజయవంతంగా తన పని పూర్తిచేసింది. ఇలాంటి వివిధ కక్ష్యల్లోకి ఉపగ్రహాలను పంపే ప్రయోగం నిర్వహించడం ఇస్రో ఇది రెండోసారి. శుక్రవారం ఉదయం 5.29 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 0కు చేరగానే రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మొదట కార్టోశాట్-2ఇ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చిన వాహక నౌక అనంతరం యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఎన్‌ఐయూ శాట్‌తో పాటు మిగిలిన 29 విదేశీ ఉపగ్రహాలను కూడా నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా చేర్చింది. ఈ ప్రయోగ విజయంతో షార్ సంబరాలు అంబరాన్నింటాయి. ఇస్రో శాస్తవ్రేత్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇదే తరహా ప్రయోగాలు ప్రయోగించేందుకు ఇస్రో సైతం సన్నాహం చేస్తోంది. మొదట బుడిబుడి అడుగులు వేస్తున్న మన శాస్తవ్రేత్తలు దినదిన అలుపెరగని అధ్యయనంతో నేడు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి ప్రపంచ దేశాలకు దీటుగా ప్రయోగాలు చేపట్టే ఎత్తుకు ఎదిగారు. ఇందుకు కారణం శ్రీహరికోటలో ప్రయోగాలకు అనుకూలంగా ఉండటమే. పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలైతే ఇస్రోకు చేతిలో పెట్టిన విద్యగా మారిపోయింది. ఈ ప్రయోగాల్లో వినూత్న పద్ధతిలో ప్రయోగాలు చేపట్టి విజయాలు సాధిస్తున్నారు. దేశ కీర్తిప్రతిష్టలు సైతం షార్‌తో ముడిపడి ఉన్నాయి. ఇక్కడ నుండే విదేశాలు సైతం తమ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో ఇస్రో వాణిజ్యపరంగా సాంకేతిక సిరులు కురుస్తోంది. అతి తక్కువ కాల వ్యవధిలోనే రాకెట్‌లు రూపకల్పన చేసి అగ్రదేశాలకు దీటుగా తక్కువ వ్యయంతో ప్రయోగాలు చేపట్టడం మరో విశేషం. నిజంగా ఒకే రాకెట్ ద్వారా బహుళ కక్ష్యల్లోకి ఉపగ్రహాలను పంపడం ఇస్రోకు కొత్తేమీ కాదు. ఒకే రాకెట్‌లో ఉపగ్రహాలు వివిధ కక్ష్యలోకి పంపించి ప్రయోగించడం వల్ల ప్రయోగ వ్యయాలు తగ్గుతాయి. ప్రస్తుతం ఇస్రో రెండు రాకెట్ల ద్వారా వీటిని ప్రయోగించాల్సి ఉంటుంది. ఈ ప్రయోగంలో ఇస్రో ఘనత సాధించడమే కాకుండా చరిత్ర సృష్టించడం మరో విశేషం. ఈ ప్రయోగం తీర ప్రాంత భూముల వినియోగం, నీటి సరఫరా తదితర వాటికి ఉపయోగపడుతోంది. మన దేశ భూపరిశీలనకు స్వదేశీ వ్యవస్థ వినియోగంలో భాగంగా కార్టోశాట్-2 ఇ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. కార్టోశాట్-2 సిరీస్‌లో ఇది ఆరో ఉపగ్రహ ప్రయోగం. ఇంతకు ముందు పంపిన శాటిలైట్స్ అన్ని సేవలు అందిస్తున్నాయి. ఇందులో అమర్చిన మల్టీ స్పెక్ట్రర్ కెమెరా సాయంతో మనదేశ భూభాగాలను ఛాయా చిత్రాలను స్పష్టంగా తీసి పంపుతోంది. రోడ్ల నెట్‌వర్క్ పర్యవేక్షణ సేవలకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతోంది. కార్టోశాట్-2ఇ ఉపగ్రహం ఐదు సంవత్సరాల పాటు సేవలు అందించనుంది.