శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నియంత పరిపాలనకు స్వస్తి పలుకుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, జూన్ 23: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయన వ్యవహార శైలికి స్వస్తి పలికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక పిచ్చిరెడ్డి కల్యాణ మండపంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపి మేకపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరినీ ఒకే విధంగా చూడాల్సిన వ్యక్తి వారి ఆస్తులను వారి భద్రతకు ధర్మకర్తగా ఉండాల్సిన సిఎం ప్రజాకంటకుడై ప్రజలను భక్షిస్తూ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజలను భయపెట్టే స్థాయికి రావడం ఆయన నియంత పోకడలకు నిదర్శనమని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు మనజాలరని, వీరిని ఇంటికి పంపించాల్సిన అవసరం వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలపై ఉందని ఆయన పేర్కొన్నారు. నెరవేర్చలేని ఆరు వందల హామీలను ప్రజలకు చేశారని, వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చేలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సినంత శక్తి తెలుగుదేశం పార్టీకి ఉన్నప్పటికీ వైఎస్‌ఆర్‌సిపిలో గెలిచిన 21 మంది ఎంఎల్‌ఎలను తన వైపుకు లాక్కొని వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి ఊరేగిస్తున్నారని విమర్శించారు. ఎన్‌టిఆర్‌లాంటి గొప్ప వ్యక్తిని చంద్రబాబునాయుడు వెన్నుపోటుతో ద్రోహం చేశాడని, పిల్లను ఇచ్చిన మామనే ద్రోహం చేసిన వ్యక్తి ప్రజలను మోసం చేయడం గొప్ప వింతేమి కాదన్నారు. ఎన్‌టి రామారావు మరణానికి కూడా చంద్రబాబునాయుడు పెట్టిన క్షోభే కారణమని, ఒక విధంగా చెప్పాలంటే ఆయన మరణానికి చంద్రబాబునాయుడే కారణమని ఎంపి ఆరోపించారు. ఎన్‌టిఆర్ బతికి ఉంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేదని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి ప్రదేశ్‌గా తయారుచేస్తున్నాడని ఆయన విమర్శించారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపిని గెలిపించుకొని జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకున్న నాడే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వైఎస్‌ఆర్ పార్టీలో ఉన్న 46 మంది ఎమ్మెల్యేలు తిరిగి బ్రహ్మాండంగా గెలుస్తారని ఆయన జోస్యం చెప్పారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయాన్ని స్వర్ణ యుగంగా పోలుస్తారని ఆయన పేర్కొన్నారు. రాజశేఖర్‌రెడ్డి చేసిన పనులు చూసైనా చంద్రబాబునాయుడు నేర్చుకుంటాడంటే అది కూడా చేయడం లేదన్నారు. 2019 ఎన్నికల్లో చిన్న పొరపాటు కూడా చేయకూడదని, అతి విశ్వాసం విడనాడాలని ఆయన సూచించారు. జిల్లాలో పది శాసనసభ, రెండు ఎంపి స్థానాలు గెలిచి తీరాలని, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి శక్తికి మించి పోరాటం చేశారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. రాబోవు ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోని పక్షంలో రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోతుందని, ప్రజాస్వామ్యం అనేది పునాదులతో కూలగొట్టడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.
బ్రూస్లీతో పోరాటం చేస్తున్నా : జిల్లా అధ్యక్షులు కాకాణి
ప్లీనరీలో భాగంగా జిల్లా వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షులు సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులైన కాకాణి గోవర్దన్‌రెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో బ్రూస్లీతో పోరాటం చేస్తున్నానని మంత్రి చంద్రమోహన్‌రెడ్డిని దృష్టిలో పెట్టుకొని అన్నారు. గడిచిన టిడిపి పాలనలో రాష్ట్రం అత్యంత దారుణమైన స్థితికి చేరుకుందని ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా ఆ నియోజక వర్గంలోని ప్రజలను కక్ష సాధింపు ధోరణిలో ప్రభుత్వం పనిచేస్తూ ఉందని విమర్శించారు. తనయుడు లోకేష్‌బాబును నాయుకుడిగా ప్రమోట్ చేయడానికి చంద్రబాబునాయుడు నానా తిప్పలు పడుతున్నారని, ఇప్పటివరకు ఆ పప్పుకు మాట్లాడటం చేతకావడం లేదన్నారు.
కార్యకర్తలను ఆదుకోలేకపోతున్నా: కోటంరెడ్డి
ప్లీనరీని ఉద్దేశించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ, తన విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు ఎలాంటి సహాయం చేయలేకపోవడం బాధ కలిగిస్తుందని, 2019లో జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే ప్రతి కార్యకర్తలకు అన్ని విధాలా ఆదుకుంటానని ఆయన తెలిపారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో 934 సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వాటిలో 933 సమస్యలను తీర్చకలిగినందుకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఒక నాయకుడు పది మంది కార్యకర్తలను తీసుకురావాలంటే ఎంత శ్రమిస్తారో నాకు తెలుసునని, ఆ స్థాయి నుండి వచ్చిన వాడిని కాబట్టి వారి బాధలు తెలుసునని ఆయన చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజక వర్గంలో శ్మశానవాటికలు, పార్కులు, వివిధ వౌలిక వసతుల కోసం సుమారు రెండున్నర కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందని ఆయన తెలిపారు. రాబోవు ఒకటిన్నర సంవత్సరంలో వైఎస్‌ఆర్ పార్టీ కార్యకర్తలు అత్యంత చురుకుగా వ్యవహరించి ప్రజలతో మమేకం కావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అనంతరం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి, నగర శాసనసభ్యులు అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు ప్రసంగించారు. పెనుబర్తి గ్రామానికి చెందిన పలువురు తెలుగుదేశం కార్యకర్తలు ఎంపి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ ప్లీనరీలో 33 తీర్మానాలను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నాయకులు, గ్రామాల ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, భారీ స్థాయిలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.