శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 23: ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి పోలీసులు తీసుకుంటున్న కట్టడి చర్యలతో బెంబేలెత్తుతున్న స్మగ్లర్లు తమ అక్రమాలకు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. తాజాగా వాటర్ ట్యాంకర్‌లో ఎర్రచందనం దుంగలు దాచి రాష్ట్ర సరిహద్దులు దాటించేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు పసిగట్టారు. వెంకటగిరి సర్కిల్ పరిధిలో జరిగిన రెండు సంఘనల్లో సుమారు రూ.10లక్షల విలువ చేసే టన్ను ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను శుక్రవారం స్థానిక ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్పీ విశాల్‌గున్ని వివరించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. వెంకటగిరి మండలం దాచెరువు గ్రామానికి చెందిన పారె మురళి గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌తో పాటు పలు ఘర్షణల్లో నిందితుడిగా ఉన్నాడు. అతను శ్రీకాళహస్తి మండలం ఇలగనూరు గ్రామానికి చెందిన గోనుగొడుగు రమేష్‌తో కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేందుకు ఒక వాటర్ ట్యాంకర్‌ను ఎంచుకొని అందులో ప్రత్యేక అమరికలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో వెంకటగిరి సిఐ శ్రీనివాసరావుకు వచ్చిన సమాచారం మేరకు వల్లివేడు చెరువు వద్ద వెళుతున్న వాటర్ ట్యాంకర్‌ను నిలిపి తనిఖీ చేయగా అందులో దాచిన 24 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా డక్కిలి మండలం చీకిరేనిపల్లి చెరువు సమీపంలో తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగను, ఒక మినీ ట్రక్‌ను అదే గ్రామానికి చెందిన సుధారాసి మునేంద్ర అనే స్మగ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రెండు చోట్ల స్వాధీనం చేసుకున్న దుంగల విలువ రూ.10లక్షలు ఉంటుందని, వాహనాల విలువ రూ.14లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ రెండు సంఘటనల్లో ప్రతిభ కనబర్చిన వెంకటగిరి సిఐ శ్రీనివాసరావు, ఎస్సై కె.కె.నాయుడు, డక్కిలి ఎస్సై కె.మారెడినాయుడులతో పాటు కానిస్టేబుళ్లు ఐ.నారాయణ, సురేష్, వరప్రసాద్, ఉమా, సురేష్‌రెడ్డి, నాగరాజు, గురవయ్య, సురేష్‌బాబులను అభినందించి రివార్డులు అందచేశారు. ఈ సమావేశంలో గూడూరు ఇన్‌చార్జ్ డిఎస్పీ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.