కృష్ణ

440 మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 23: ప్రతి గ్రామ పంచాయతీకి ఒక మీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 440 గ్రామ పంచాయతీల్లో మీ సేవా కేంద్రాల నిర్వహణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఇటీవల 600 పైబడి గ్రామ పంచాయతీల్లో మీ సేవా కేంద్రాల నిర్వహణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపికను పూర్తిచేసి మీ సేవా కేంద్రాలను మంజూరు చేశామన్నారు. రెండవ విడతగా మిగిలిన 440 గ్రామ పంచాయతీల్లో కూడా మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. లిఖితపూర్వకంగా అర్జీలు స్వీకరించనున్నారు. గతంలో లిఖితపూర్వకంగా ఇచ్చిన అర్జీలను కూడా పరిగణలోకి తీసుకోబోమని తెలిపారు. జూలై 23వతేదీ లోపు విధిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జెసి చంద్రుడు పేర్కొన్నారు.