కృష్ణ

సాగునీటి కోసం రైతన్నల ఆరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జూన్ 23: మొవ్వ మండలంలోని కాలువలకు కృష్ణా జలాలు విడుదల కాకపోవటంతో సాగునీరు అందక ఒక వైపు పోసిన నారుమడులు నీరు లేక బీటలు వారి ఎండిపోతున్నాయి. వేరొక వైపు డీజిల్ ఇంజన్ల కింద పోసిన నారుమడులు ఏపుగా పెరిగి నవనవలాడుతున్నాయి. దీంతో నీరు అందని రైతులు ఆవేదన చెందుతుండగా, మోతుబరి రైతులు సంతృప్తి చెందుతున్నారు. మండలంలో 1350 ఎకరాల్లో నారుమడులు వేయాల్సి ఉండగా కేవలం 40శాతంగా 500 ఎకరాల్లో నారుమడులు పోశారని ఎఇఓ బోలెం అనంతలక్ష్మి తెలిపారు. ఇందులో ఏంటియు 1017, 1061 రకం విత్తనాలు వేశారు. వ్యవసాయ శాఖ కిలో రూ.5 సబ్సిడీపై ఏంటియు 1061 రకం విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 80 రోజుల వ్యవధిలో కోతకు వచ్చే ఈ రకాల సాగు కారణంగా ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈశాన్య రుతుపవనాలతో సంభవించే తుపాన్‌ల ప్రభావం వరి పంటపై ఉండకుండా ఉండేందుకే ప్రభుత్వం ముందస్తు వరి సాగుకు కృషి చేస్తుందని ఆమె తెలిపారు.