విజయవాడ

విఎంసి నూతన భవన నిర్మాణ పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 23: నగర పాలక సంస్థ పరిపలనా అవసరాలతోపాటు ఆదాయ వనరు కోసం నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. శంకుస్థాపన జరిగిన నాటి నుంచి ఎదురైన ఎన్నో అవరోధాలను అధిగమించిన ఈ భవన నిర్మాణం ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకొని సెల్లార్ శ్లాబ్ వేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సెంట్రింగ్ వర్క్‌ను పూర్తి చేసుకున్న సెల్లార్‌కు రేపో మాపో శ్లాబ్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ సుమారు 6 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసినట్టు సమాచారం కాగా సెల్లార్ శ్లాబ్ వర్క్ పూర్తయ్యేనాటికి మరో కోటి ఖర్చవుతుందని అంచనా. జి ప్లస్ 9 అంతస్తులుగా నిర్మితమవుతున్న ఈ భవనం మొదటి 6 అంతస్తులను విఎంసి పరిపాలనా అవసరాల కోసం వినియోగించనుండగా మిగిలిన 7, 8, 9 అంతస్థులు వ్యాపార అవసరాలకు కేటాయించాలన్న ఆలోచన అధికారులున్నారు. సుమారు రూ.32 కోట్ల అంచనా వ్యయం కాగల ఈ భవనం పూర్తయ్యేసరికి అంచనాల్లో హెచ్చు, తగ్గులుండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నగర పాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల కార్యాలయాల కోసం సరైన గదులు లేకపోవడంతో ఎస్టేట్ సెక్షన్ సర్కిల్-2 కార్యాలయంలో ఏర్పాటు చేయగా మరికొన్ని విభాగాలు పలుచోట్ల ఏర్పాటుచేశారు. అలాగే ప్రస్తుతం యుసిడి, అకౌంట్స్, రికార్డ్ సెక్షన్, టౌన్‌ప్లానింగ్, ఆన్‌లైన్ ప్లానింగ్ సెక్షన్, రెవెన్యూ, పిఆర్‌ఓ పబ్లిక్ హెల్త్, ఎలక్షన్, తదితర సెక్షన్లు ప్రస్తుతం ఉన్న పాత భవనంలోనే కొనసాగుతున్నప్పటికీ ఎంతో ఇరుకిరుకుగా సర్దుకుపోవాల్సి వస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే పంచాయతీ కార్యాలయం కంటే ఎంతో అసౌకర్యంగా ఉన్న ప్రస్తుత విఎంసి కార్యాలయ భవనం ప్రస్తుత పరిపాలక అవసరాలను తీర్చలేకపోతున్న తరుణంలో నూతన భవన నిర్మాణ ఆవశ్యకత పెరిగింది. గత నవంబర్‌లో మొదలైన ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభమైన మొదట్లోనే కొన్ని సాంకేతిక కారణాలతో పనులు నిలిచిపోయాయి. చివరికి నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి భవన నిర్మాణ అవసరాలను వివరించి అధికారిక అనుమతులను తీసుకొచ్చిన నాటి నుంచి నేటి వరకూ నిర్మాణ పనులు నిర్విగ్నంగా సాగుతున్నాయనే చెప్పాలి. ఇదంతా భాగానే ఉన్నా ప్రస్తుత చురుగ్గా సాగుతున్న నిర్మాణ పనులకు అంతే చురుగ్గా బిల్లుల చెల్లింపులు లేకపోవడం నిర్మాణదారులకు ఒకింత ఆశనిపాతంగా మారింది. ప్రస్తుతం సుమారు రూ.7కోట్ల వరకూ ఖర్చవుతున్నా ఇప్పటివరకూ నయా పైసా విడుదల చేయకపోవడం గమనార్హం. ప్రస్తుత విఎంసి ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులను పరిశీలిస్తే బిల్లుల చెల్లింపులపై అనేక అనుమానాలు రేకెత్తుతుండగా భవిష్యత్తులో నిధుల కొరత ఉత్పన్నమైయ్యే అవకాశం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ భవన నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న మేయర్ శ్రీ్ధర్ తన కలల భవనంగా పరిగణిస్తున్న నూతన భవనం అన్నీ కలిసొస్తే మరో 9 నెలల్లో నిర్మాణ పూర్తయ్యే అవకాశం ఉంది.