విజయవాడ

పంటలకు మద్దతు ధర మరింత పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: వ్యవసాయ శాస్తవ్రేత్త స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకనుగుణంగా వరి, ఇతర పంటలకు మద్దతు ధరలు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం క్వింటా ధాన్యంకు రూ.500లు బోనస్ ఇవ్వాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ప్రభుత్వరంగ సంస్థల ద్వారా కొనుగోళ్లు జరిపించాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఏపి రైతు సంఘం ఆధ్వర్యంలో విజయవాడ దాసరి భవన్‌లో శుక్రవారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్నీడు యల్లమందరావు అధ్యక్షత వహించారు. వరి, మొక్కజొన్న, జొన్నకు రూ.80, రూ.60, రూ.70లు మద్దతు పెంచినట్టు ప్రకటించిన కేంద్రం మిర్చిని మరిచిపోవడం దారుణమని నేతలు అన్నారు. పంటలకు మద్దతు ధర నిర్ణయించడంలో అశాస్ర్తియంగా వ్యవహరిస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయ కమిటీకి చట్టబద్ధత కల్పించడమే కాకుండా అందులో రైతు ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎరువులు, పురుగుమందులతోపాటు వ్యవసాయ ఉపకరణాలపై జిఎస్‌టిని ఎత్తివేయాలని, ఉత్పత్తి ధర విధానాన్ని శాస్ర్తియంగా నిర్ణయించాలని కోరారు. త్వరలోనే అఖిలపక్షంతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రిని కలిసి మద్దతు ధరలపై కేంద్రం పునరాలోచన చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు సమాయత్తం కావాలని కూడా నిర్ణయించారు. ఈ సమావేశంలో అఖిల భారత కిసాన్ సంఘ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, వైకాపా రైతు విభాగం కన్వీనర్ ఎంవిఎస్ నాగిరెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.కుమారస్వామి, కౌలు రైతు సంఘం నేత నాగబోయిన రంగారావు, కృష్ణాడెల్టా పరిరక్షణ నేత కొలనుకొండ శివాజీ, సిపిఎం రైతు సంఘ నేత పి.పెద్దిరెడ్డి, ఏపి మహిళా సమాఖ్య నాయకురాలు పి.దుర్గ్భావాని తదితరులు ప్రసంగించారు.